కమల్ హాసన్ ని కలుసుకున్న పివి.సింధు

0
802

ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు ప్రస్తుతం ప్రముఖ రాజకీయ నాయకులను ప్రముఖ వ్యక్తులను ప్రత్యే కంగా కలుసుకుంటున్నారు. ఇక నేడు చెన్నైకి వెళ్లిన ఆమె సినీ నటుడు మక్కల్ నీది మయం అధ్యక్షుడిని కూడా కలుసుకున్నారు. చెన్నైలో మక్కల్ నీది మయం కార్యాలయం లో కమల్ హాసన్ తో భేటీ అయిన సింధూ మీడియాతో మాట్లాడారు.

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ గెలిచిన పివి సింధు రీసెంట్ గా తెలుగు రాష్ట్ర నాయకులను కలుసుకొని వారికి షటిల్ బ్యాట్ ని జ్ఞాపికగా అందజేశారు. కమల్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కమల్ హాసన్ గారిని కలుసుకోవడానికి
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫైనల్ గా నేటితో తన కోరిక నెరవేరిందని కమల్ గొప్పతనాన్ని గురించి తెలియజేశారు.

కమల్ హాసన్ పివి సింధును సత్కరించి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ గెలిచిన సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాల్లో బిజీ అవుతూనే సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here