ప్రస్తుతం బాలీవుడ్ లో గ్యాప్ లేకుండా సినిమాలను వదులుతున్న హీరోలో అక్షయ్ కుమార్ ఒకరు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే అక్షయ్ మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. అందులోను రొటీన్ గా కాకుండా ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సూర్యవన్షి తో రెడీ అవుతున్నాడు.
అయితే ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లో అక్షయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ లో చాలా వరకు పోలీస్ క్యారెక్టర్స్ క్లిక్కయ్యాయి. ఎవరి స్టయిల్లో వారు ఇరగదీశారు. అయితే రీసెంట్ గా క్లిక్కయిన సింబా – సింగం క్యారెక్టర్స్ తరహాలో అక్షయ్ పాత్ర ఉండబోతోందని ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేశారు. పైగా ఒకే ఫ్రేమ్ లో అక్షయ్ కుమార్ తో అజయ్ దేవ్ గన్ సింగం – రణ్ వీర్ సింగం పాత్రలు కూడా సినిమాలో మెరవనున్నట్లు తెలుస్తోంది.
చూస్తుంటే సాంగ్ లో ఈ ముగ్గురు ఒకేసారి దర్శనమిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా డిఫరెంట్ జానర్స్ తో అక్షయ్ తన టాలెంట్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సూర్యవన్షి ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చ్ లో సినిమాను విడుదల చేయాలనీ అక్షయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


