వెరైటీ సినిమాల దర్శకుడు అల్లరి రవిబాబు నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా థ్రిల్లర్ జానర్ మూవీ ఆవిరి. నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. మున్నీ అనే ఒక చిన్న పాప, తన తల్లితండ్రులకు తెలియకుండా ఇంటి నుండి వెళ్ళిపోలనుకోవడం,
అయితే ఆశ్చర్యకరంగా ఒక ఆత్మ ఆ పాపను వశపరుచుకొని ఇంటినుండి తీసుకెళ్లిపోవడం, ఆ తరువాత ఆ పాప ఎక్కడుందో తల్లితండ్రులు ఏవిధంగా కనిపెట్టారు అనే వినూత్న కథాంశంతో సినిమా తెరకెక్కుతున్నట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ మరియు సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ ట్రైలర్, సినిమాపై బాగా అంచనాలు పెంచిందని చెప్పాలి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై తెరక్కుతున్న ఈ సినిమాలో దర్శకుడు రవి బాబు కూడా ఒక పాత్రలో నటించడం జరిగింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను నవంబర్ 1 న రిలీజ్ చేయనున్నారు…!!


