అందరిచూపు పాయల్ వైపే..

0
1129

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత ఎక్కువైంది. మంచి విజయాలు అందుకోవడమే కాకుండా ఆడియెన్స్ ని అన్ని విధాలుగా నటనతో మెప్పిస్తేనే కథానాయికలు క్లిక్కవుతున్నారు. ఆ తరహాలో ఇప్పుడిపుడే కొత్తగా అడుగులు వేస్తోంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈ బ్యూటీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఆ సినిమాకు పాయల్ గ్లామర్ డోస్ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు RDX లవ్ సినిమాపై కూడా అలాంటి వైబ్రేషన్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ద్వారా హాట్ అందాలు ఓ వర్గం ఆడియెన్స్ తెగ ఎట్రాక్ట్ చేశాయి. అలాగే టీజర్ ట్రైలర్ లో కూడా గ్లామర్ డోస్ తో పాటు ఇంట్రెస్టింగ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అందరిచూపు ఎక్కువగా పాయల్ గ్లామర్ వైపే ఉంది. మరి ఆర్ఎక్స్ 100తో మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న పాయల్ ఇప్పుడు RDX లవ్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. తేజస్ కంచ‌ర్ల ప్రాధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శంక‌ర్ భాను దర్శకత్వం వహించగా రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here