దర్బార్ పని పూర్తి చేసిన సూపర్ స్టార్

0
884

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్బార్ సినిమాతో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ పాత్రలో సరికొత్త కిక్ ఇవ్వబోతున్నారు. దర్బార్ సినిమా షూటింగ్ పార్ట్ ని పూర్తి చేశారు. చిత్ర యూనిట్ త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టనుంది.

పొంగల్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ముందు నుంచి అభిమానులకు అప్డేట్ ఇస్తున్న దర్బార్ టీమ్ ప్రమోషన్స్ కి కూడా స్పెషల్ ప్లాన్ వేసుకుంటోంది. ఆడియెన్స్ టీజర్ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో నెక్స్ట్ టీజర్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నివేత థామస్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా. అనిరుద్ రవిచందర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here