హీరోగా థర్డ్ జనరేషన్ బాలీవుడ్ స్టార్

0
598

బాలీవుడ్ సీనియర్ స్టార్ ధర్మేంద్ర గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వెండితెరపై తనకంటూ చెరగని ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న ఆయన తన కొడుకులను కూడా అదే తరహారలో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సన్నీ డియోల్ – బాబీ డియోల్ ఇద్దరు కూడా మంచి నటులుగా వెలుగొందారు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా సిద్దమైంది.

సన్నీ డియోల్ తనయుడు కరణ్ డియోల్ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ‘పల్ పల్ దిల్ కె పాస్’ అనే రొమాంటిక్ డ్రామాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేశాడు. విశేషమిటంటే సన్నీ డియోల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అడ్వెంచర్ అండ్ రొమాంటిక్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here