మనుషుల ప్రాణాలను బలితీసుకునే అడివి మృగాల బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే మొదటిసారి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా బాహుబలి ఫెమ్ సత్యరాజ్ తనయుడు సిబిరాజ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా సినిమాకు రేంజర్ అనే టైటిల్ కూడా సెట్ చేశారు.
మహారాష్ట్ర యావత్మాల్ అనే జిల్లాలో కొన్నాళ్లక్రితం ఆవ్నీ అనే పులి చాలా మంది మనుషుల మీద దాడి చేసి ప్రాణాలను బలిగొంది. దేశంలో అందరిని షాక్ కి గురి చేసిన ఈ ఘటన ఆధారంగా రేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ – కేరళ – తమిళనాడు వంటి ప్రాంతాల్లో సినిమాను షూట్ చేయడానికి దర్శకుడు ధరణీధరణ్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఇక సినిమాలో సిబిరాజ్ పాత్ర అద్భుతంగా ఉంటుందని సినిమాలో గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నట్లు నిర్మాత మహేష్ తెలిపారు.


