ఆది క్రియేషన్స్ బ్యానర్ మీద సాయి కృష్ణ నిర్మాణంలో శ్రీకరం ప్రభాకర్ తెరకెక్కించిన చిత్రం ‘మిసెస్ కల్నల్’.. ఘనంగా టీజర్ లాంచ్ ఈవెంట్
ఆది క్రియేషన్స్ బ్యానర్ మీద విలోక్, కౌశిక్ సమర్పణలో సాయి కృష్ణ నిర్మాతగా శ్రీకరం ప్రభాకర్ తెరకెక్కించిన చిత్రం ‘మిసెస్ కల్నల్’. ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ హీరోయిన్ , హీరో గా మాన్య గౌడ, మహేష్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ టీజర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో..
దర్శకుడు శ్రీకరం ప్రభాకర్ మాట్లాడుతూ .. ‘‘మిసెస్ కల్నల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాను. ఈ మూడేళ్లలో మేం ఎంతో యుద్ధం చేశాం. ఇది కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమా అని అనుకోవద్దు. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత సాయి కృష్ణ మాట్లాడుతూ ..‘‘మిసెస్ కల్నల్’ చిత్రాన్ని శ్రీకరంతో కలిసి చేశాం. మా సినిమా బాగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ప్రియా హెగ్డే మాట్లాడుతూ .. ‘‘మిసెస్ కల్నల్’ ఇది మాకు ఓ సినిమా మాత్రమే కాదు. మా మూడేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. నాకు ఇంత మంచి పాత్ర లభించడం అదృష్టం. సాయి కృష్ణ గారు ఈ జర్నీలో ఎన్ని సమస్యలు వచ్చినా.. ధైర్యంగా నిలబడ్డారు. డైరెక్టర్ శ్రీకరం ప్రభాకర్ సర్ ఎంతో కూల్‌గా ఉంటారు. వంద కాదు వెయ్యి శాతం కష్టపడి, ఇష్టపడి సినిమాని చేశాం. మా మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
హీరో చిరాగ్ జానీ మాట్లాడుతూ .. ‘‘మిసెస్ కల్నల్’ లాంటి చిత్రంలో హీరో పాత్ర లభించడం నా అదృష్టం. ఇది నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శ్రీకరం గారికి, సాయికృష్ణ గారికి థాంక్స్. దేశ భక్తి నేపథ్యంలో సాగే మా సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మా టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటుడు మహేష్ విట్టా మాట్లాడుతూ .. ‘‘మిసెస్ కల్నల్’ చిత్రంలో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. శ్రీకారం గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సాయి కృష్ణ గారికి థాంక్స్. ఈ సినిమాలో అన్ని రకాల అంశాలుంటాయి’ అని అన్నారు.
మాన్య గౌడ మాట్లాడుతూ .. ‘‘తెలుగులో నాకు ఇదే తొలి చిత్రం. ‘మిసెస్ కల్నల’ సినిమాలో నటించడం నా అదృష్ణం. డైరెక్టర్ ప్రభాకర్ నాకు ఎంతో సహకరించారు. సాయి కృష్ణ గారు గొప్ప నిర్మాత. ఆదిలక్ష్మీ గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ప్రియతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆడియెన్స్ మా సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఎడిటర్ కార్తికేయన్ మాట్లాడుతూ .. ‘‘మిసెస్ కల్నల్’ సినిమా బాగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటీనటులు : ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ, మాన్య గౌడ, మహేష్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ తదితరులు
టెక్నికల్ టీం
బ్యానర్ : ఆది క్రియేషన్స్
సమర్పణ : విలోక్, కౌశిక్
నిర్మాత : సాయికృష్ణ
దర్శకుడు : శ్రీకరం ప్రభాకర్
సంగీతం : సునీల్ కశ్యప్
కెమెరామెన్ : కార్తిక్ కొప్పెర
ఎడిటర్ : కార్తికేయన్ రోహిణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వెంకటేశ్వర్లు.సి
పీఆర్వో : మాడూరి మధు



