విశ్వక్ సేన్ ‘లెగసీ’ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు.
ప్రధాన చిత్రీకరణ పూర్తికావడంతో సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ రెడ్డి దైదాకు ‘లెగసీ’ రెండో దర్శకత్వ చిత్రం. అలాగే కళాహి మీడియా సంస్థకు ఇది రెండో నిర్మాణ చిత్రం కావడం విశేషం.
రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం అధికారం, ఆశయం, కుటుంబ బంధాలు, ప్రేమ, ద్రోహం వంటి బలమైన అంశాల చుట్టూ సాగుతుంది. తన తండ్రి రాజకీయ వారసత్వం కారణంగా అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిన ఓ వారసుడి జీవిత ప్రయాణమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. రాజకీయాల ప్రభావం వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి పరిణామాలను చూపిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నారు.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు కే కే మీనన్ శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్నారు.
రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ టీజర్‌తో పాటు ఇతర ప్రచార చిత్రాలు ‘లెగసీ’ ప్రపంచంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, జిజు సన్నీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, స్టంట్ జశువా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
షూటింగ్ పూర్తిచేసుకున్న ‘లెగసీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో విడుదలకు సిద్ధమవుతోంది. 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
POLITICS IS PERSONAL.
‘లెగసీ’ – 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల.
A Kalaahi Media Production.
తారాగణం:
విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్, మురళీ మోహన్, కే కే మీనన్
రావు రమేష్, సచిన్ ఖేడేకర్, రాజా రవీంద్ర , ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, తదితరులు.
సాంకేతిక బృందం:
ఛాయాగ్రహణం: జిజు సన్నీ
కూర్పు: శిరీష్ ప్రసాద్
సంగీతం: గోవింద్ వసంత
గీత రచయితలు: అనంత శ్రీరామ్, కవి సిద్ధార్థ
కథ: సాయి కిరణ్ రెడ్డి దైదా, కవి సిద్ధార్థ
కళా దర్శకుడు: రాజీవ్ నాయర్
యాక్షన్: స్టంట్ జాషువా
సౌండ్ డిజైన్: సింక్ సినిమా
డాల్బీ అట్మాస్: ఈ. రాధాకృష్ణ (ప్రసాద్ మిక్సింగ్ థియేటర్)
అసోసియేట్ సినిమాటోగ్రాఫర్: ఎం. శ్రీధర్
కో-డైరెక్టర్లు: మేడి కె. స్వామి, జయరమేష్
కాస్ట్యూమ్ డిజైనర్లు: పూజిత తాడికొండ, నాగ సాయి చరణ్
పిఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
పబ్లిసిటీ డిజైనర్: అన్ టైటిల్ట్ వర్క్స్
డీఐ: శ్రీ సారధి స్టూడియోస్
వీఎఫ్ఎక్స్: డార్క్ బ్లూ స్టూడియోస్
డిజిటల్ మార్కెటింగ్: ప్రమోట్ ఈజీ



