‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం

0
1
Srinidhi Shetty as Swarna in Aadarsha Kutumbam House No 47 - #AK47
Srinidhi Shetty as Swarna in Aadarsha Kutumbam House No 47 - #AK47
‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం
విక్టరీ వెంకటేష్ పోషించిన చిట్టిబాబు పాత్ర పరిచయానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) చిత్ర బృందం ఈ ఆదర్శ కుటుంబంలోని మరో కీలక సభ్యురాలిని పరిచయం చేసింది.
ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’ పాత్రలో నటిస్తున్నారు. చిట్టిబాబుకు భార్యగా, చిరునవ్వే చిరునామాగా ఉండే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకోనుంది. చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం, చిలిపి సంభాషణలు, అనురాగం, కుటుంబ విలువలు సినిమాకు మరింత ఆత్మను, ఆహ్లాదాన్ని అందించనున్నాయి.

విడుదలైన ఈ క్యారెక్టర్ గ్లింప్స్‌లో నివేదా పేతురాజ్, ప్రముఖ హాస్యనటుడు సత్య కొన్ని క్షణాలు కనిపిస్తూ చిత్రంలోని వినోదాత్మక వాతావరణాన్ని మరింత ఆసక్తికరంగా మలిచారు.
ఇప్పటికే విడుదలైన పాత్ర పరిచయాలు ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని రేకెత్తించగా, త్వరలోనే యువినా పార్థవిను ‘సంపూర్ణ’గా, రాజా ప్రజ్వల్ను ‘సర్వ’గా చిత్ర బృందం పరిచయం చేయనుంది.
ప్రఖ్యాత హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహిస్తున్నారు. థమన్ ఎస్. సంగీతం అందిస్తుండగా, రవి.కె. చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రేక్షకులందరికీ హృద్యమైన కుటుంబ వినోదాన్ని అందించనున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here