రాకింగ్ స్టార్ యశ్‌ ‘టాక్సిక్’ నుంచి ఫియర్, మిస్టరీ, స్టైల్‌ను ప్రజెంట్ చేసే వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్ రిలీజ్

0
1
Toxic - Poster
Toxic - Poster
రాకింగ్ స్టార్ యశ్‌ ‘టాక్సిక్’ నుంచి ఫియర్, మిస్టరీ, స్టైల్‌ను ప్రజెంట్ చేసే వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యశ్‌ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ఇక కేవలం నెల రోజులే మిగిలాయి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తూ మేకర్స్ మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఫియర్, మిస్టరీ, స్టైల్‌ కలగలిసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఈ పోస్టర్‌లో యశ్ ప్రశాంతంగా సిగరెట్ వెలిగిస్తున్నట్లు కనిపిస్తున్నారు.  పొగ, చీకటి కారణంగా ఆయన ముఖం పూర్తిగా కనిపించకుండా మిస్టరీని కొనసాగించారు. ఆయన చేతి మాత్రం రక్తంతో తడిసి ఉండటం, వేళ్ల నుంచి రక్తపు చుక్కలు జారుతూ తెల్లటి షర్ట్‌పై పడటం చూస్తే ఒక టెర్రిఫిక్ యాక్షన్ సీన్ ని చూపిస్తోంది.

యశ్ రఫ్ బియర్డ్, టాటూలతో చేతులు, స్టైలిష్ రింగ్స్, టైలర్డ్ ఓవర్‌కోట్‌తో పవర్‌ఫుల్ గా కనిపించారు.  బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌డ్రాప్‌లో రక్తపు ఎరుపు రంగు, సిగరెట్ నిప్పు మాత్రమే ప్రత్యేకంగా హైలైట్ అవుతూ పోస్టర్‌ను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాయి.

KVN ప్రొడక్షన్స్ మరియు మాస్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ‘టాక్సిక్’ తన ప్రత్యేకమైన ప్రమోషనల్ క్యాంపెయిన్‌తో ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. కథ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించకుండా విడుదల చేస్తున్న ప్రతి పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాక్సిక్ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here