బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో నేటి నుంచి ప్రారంభమైన ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర

0
4
'AGADHA' Publicity Campaign Begins with the Blessings of Balkampet Ellamma–Pochamma 
'AGADHA' Publicity Campaign Begins with the Blessings of Balkampet Ellamma–Pochamma 

బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో నేటి నుంచి ప్రారంభమైన ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర : ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

హైదరాబాద్ నగరానికే కాదు… యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక మహా పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయం. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం ప్రతి ఏడాది బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులతో కళకళలాడుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతుంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సైతం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ క్షేత్ర విశిష్టతకు నిదర్శనం.

ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో తన ప్రచార ప్రయాణాన్ని ప్రారంభించింది ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు రూపొందించిన అత్యంత ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రం ‘అగధ’. ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్ పతాకం పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14, 2026న భారీ స్థాయిలో ‘అగధ’ విడుదల కానుంది.
జూలై 26, 2026 (ఆదివారం) నాడు ‘అగధ’ మూవీ టీమ్ బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి, అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించింది. అనంతరం అక్కడే ‘అగధ’ చిత్ర ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించింది.

కథానాయిక కామాక్షి భాస్కర్ల ఈ బోనాల కోసం ప్రత్యేకంగా అలంకరించుకుని, భక్తి శ్రద్ధలతో అమ్మవార్ల కు బోనాలు సమర్పించారు. దర్శకులు ఎం.ఎస్. రాజు , నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, చిత్ర సమర్పకులు అజయ్ కేఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.వి.ఎన్. సుబ్బరాజు, హీరో శ్రవణ్ రెడ్డి, తదితరులు తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ- “ ఈ మధ్య కాలంలో ఈ తరహా డివైన్ మిస్టిక్ థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది మా ‘అగధ’ చిత్రం. ఒక్క పోస్టర్, టీజర్ తోనే సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్కంఠ ని ప్రేక్షకుల్లో రేకెత్తించింది. ఎంఎస్ రాజు గారు ఇంతకుముందు నిర్మాతగా తీసిన ‘ దేవి’ చిత్రం అన్ని భాషల్లోనూ, అన్ని ఏరియాల్లోనూ ఒక చరిత్ర సృష్టించింది. ఆ వైబ్స్ ఇప్పుడు ‘అగధ’ విషయంలోనూ కనిపిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో ఎంఎస్ రాజు గారి కాన్ఫిడెన్స్ ప్రతి పోస్టర్ లోనూ తెలుస్తుంది. ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్దమౌతున్న ‘అగధ’ పబ్లిసిటీ జాతర ఈ రోజు అమ్మవార్ల సన్నిధి లో మొదలు కావడం శుభసూచికం “ అని తెలిపారు.

దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ- “ కొంత అమ్మ వారి మీద బేస్ అయిన కథ ‘అగధ’. ఇలా అనుకోకుండా బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రచార జాతర ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. హైరేంజ్ బడ్జెట్ సినిమాల తరహాలోనే, ‘అగధ’ ను కూడా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. సినిమా ట్రైలర్ ను త్వరలో విడుదల చేస్తాం “ అని చెప్పారు.

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి  రచన – దర్శకత్వం: ఎం.ఎస్. రాజు,
సమర్పణ: అజయ్ కేఆర్, 
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు,
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్,
సంగీతం: రాకేష్ వెంకటాపురం,
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి,
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ,
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్,
అదనపు స్క్రీన్‌ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.వి.ఎన్. సుబ్బరాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here