విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి #VenkyAnil5 (#NkrAR2) – తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి

0
2
#VenkyAnil5 And #NkrAR2 Begins
#VenkyAnil5 And #NkrAR2 Begins

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి#VenkyAnil5 (#NkrAR2)-తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 (#NKRAR2) చిత్రం కోసం జతకట్టారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి.  

ఈ సినిమా తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. ఈ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్‌లో నిర్మించారు. వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, కీర్తి సురేష్ కృతి శెట్టి షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ షెడ్యూల్‌లో కీలకమైన టాకీ పార్ట్‌తో పాటు ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించారు. చాలా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి.

ఇప్పటికే విడుదల చేసిన కళ్యాణ్ రామ్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే అనిల్ రావిపూడి తనదైన క్రియేటివ్ ప్రమోషన్స్ ఇప్పటికే అంచనాలు పెంచారు.  

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది.

ఈ చిత్రానికి బలమైన సాంకేతిక బృందం పని చేస్తున్నారు.  జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్,  ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.  ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.

#VenkyAnil5 / #NKRAR2 అనిల్ రావిపూడి మార్క్ వినోదం, కుటుంబ భావోద్వేగాలు, ఫెస్టివల్ ట్రేడ్‌మార్క్ ఎంటర్టైనర్. 

చిత్రం 2027 సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తారాగణం: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: సాహు గారపాటి
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here