జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి హార్ట్ టచ్చింగ్ లవ్ సాంగ్ ‘రావే చెలియా’ రిలీజ్

0
59
SrinivasaMangapuram Song Still
SrinivasaMangapuram Song Still

జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి హార్ట్ టచ్చింగ్ లవ్ సాంగ్ ‘రావే చెలియా’ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్  పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు.  ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రావే చెలియా సాంగ్ ని లాంచ్ చేశారు.  జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాట ప్రేమ, భావోద్వేగాలతో హార్ట్ టచ్చింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు.

నాగ్ అర్జున్ రెడ్డి అందించిన మనసుని తాకే సాహిత్యానికి, కపిల్ కపిలన్ తన వోకల్స్ తో ప్రాణం పోశారు. ప్రేమ, ఎడబాటు, మనసులోని భావాలను ఈ పాట అద్భుతంగా పలికించింది

ఈ పాటలో జై కృష్ణ, రాషా తడానీ మధ్య ప్రేమ, దూరమైనప్పుడు కలిగిన ఎమోషన్స్ ప్రేక్షకులను హత్తుకున్నాయి. విజువల్స్ కూడా పాట ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేశాయి.

అజయ్ భూపతి తన మార్క్ ఇంటెన్సిటీకి అందమైన ప్రేమకథ, పవర్‌ఫుల్ యాక్షన్‌ను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ పాటల్లో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ తమ ఆకట్టుకునే నటనతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు.

ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది. జయకృష్ణ ISC సినిమాటోగ్రఫీని నిర్వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మాధవ్ కుమార్ గుళ్ళపాటి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌.

ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు

సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి. కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ (DOP): జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్
PRO: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here