జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న “ఇల్లు”

0
9
“Illu” to Stream on ETV Win from June 14
“Illu” to Stream on ETV Win from June 14

జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న “ఇల్లు” – ప్రమోషన్స్ లో గెస్ట్ గా పాల్గొన్న రాహుల్ రవీంద్రన్

ఆర్టిస్ట్ గా వచ్చిన నేను రామానాయుడు గారిని, రామోజీ గారిని చూసి ఆదర్శంగా తీసుకుని ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాను : ఇల్లు నిర్మాత కిషోర్ మారిశెట్టి

మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా సమర్పిస్తూ కిషోర్ మారిశెట్టి నిర్మాతగా రోహిత్, శశి దర్శకత్వంలో ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న కథ సుధ చిత్రం ఇల్లు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ కథ సుధకు శశాంక్ రాఘవుల సినిమాటోగ్రఫీ చేయగా అవంతి రుయా ఎడిటింగ్ చేశారు. హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి ప్రముఖ పాత్రలో కనిపించిన చిత్రంలో అనీష్ కురువిల్ల, పవన్ రమేష్, క్యాంప్ శశి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 14వ తేదీ నుండి ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ కథ సుధ చిత్ర బృందం మీడియా వారికి ఎక్స్క్లూజివ్ స్ట్రీమింగ్ తో పాటు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.

ఈ స్ట్రీమింగ్ కు హాజరైన నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ… “ఒక సాధారణ కథను సహజ సిద్ధంగా అదేవిధంగా చాలా అందంగా ప్రేక్షకులు ముందుకు తీసుకుని రావడం అనేది ఎంతో క్లిష్టమైన విషయం. జూన్ 14 నుండి స్ట్రీమింగ్ కానున్న ఇల్లు మీ మనసులో ఎంతో ప్రశాంతతను తెలుపుతుంది” అన్నారు.

నటి బిందు చంద్రమౌళి మాట్లాడుతూ… “నాకు ఈ చిత్ర దర్శకులు రోహిత్, శశిలు ఎంతో కాలం నుండి తెలుసు. నాకు ఇల్లులో నటించేందుకు అవకాశం ఇచ్చిన వారి ఇద్దరికీ ధన్యవాదాలు అనుకుంటున్నాను. మేము రెగ్యులర్గా చేసే నటన నుండి ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. మొదటిసారి నేను ఇల్లు చూసినప్పుడు నాకు ఎలా చెప్పాలో కూడా మాటలు రాలేదు, అంత బాగుంది, నాకు అంతగా నచ్చేసింది. వివేక్ సాగర్ సంగీతం చాలా అద్భుతంగా అనిపించింది. కిషోర్ గారికి, ఈటీవీ వారికి థాంక్స్. హర్ష గారితో గతంలో కూడా కొన్ని చిత్రాలలో కలిసి నటించాను. మరోసారి బృందం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటుడు అనీష్ కురువిల్ల మాట్లాడుతూ… “నాకు దర్శకులు శశి, రోహిత్ ఎంతో కాలం నుండి తెలుసు. వారి కష్టాన్ని, వారి ఆలోచనలను నేను గమనించాను. ఇటువంటి ప్రతిభ ఉన్న వారిని ఎంకరేజ్ చేసినందుకు ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్. ఇటువంటి సహజ సిద్ధమైన పాత్రలో నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి దర్శకుల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తున్న ఈటీవీ విన్ వారికి థాంక్స్. ఇటువంటి కథలకు ఇది ఆరంభం మాత్రమే. ఈ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది” అన్నారు.

దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ… “ఈ సినిమా చాలా పద్ధతిగా చేశాము. ఈ రోజుల్లో ఒక చిన్న కథను చూపించడం, దానికి సంగీతం తోడుగా ఉండి ప్రేక్షకులకు చేరడం ఒక ప్రత్యేకమైన విషయం. మరో మూడు రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ చేయాలి అనగా నాకు కాస్త సందేహంగా ఉన్న సమయంలో పర్ఫెక్ట్ డేస్ అనే చిత్రం నా ఆలోచన మార్చేసింది” అన్నారు.

నిర్మాత కిషోర్ మారిశెట్టి మాట్లాడుతూ… “నేను మనోహరి ఆర్ట్స్ ద్వారా ముందుగా రాణి అని ఆహాలో ఒక ప్రాజెక్ట్ చేశాము. సినిమాలు కూడా చేశాను. ఇప్పుడు నిర్మాతగా రావడానికి కారణం రామానాయుడు గారు, రామోజీ గారు. ఒక ఆర్టిస్టుగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ప్రొడక్షన్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాను. కొత్త కంటెంట్ తీసుకునే రావడం నాకు సంతోషాన్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకి వచ్చినప్పుడు నాకు దర్శకుల పై మంచి నమ్మకం వచ్చింది. వీరి విభిన్నమైన దర్శనత్వ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఇద్దరు దర్శకులను తెలిసినప్పుడు నేను కాస్త ఆలోచించాను, కాని వారి ఆలోచన చూసి నేను ఆశ్చర్యపోయాను. హర్షవర్ధన్ గారి లాంటి సీనియర్ నటుడు ఈ పాత్రను చేయడం ఒక పెద్ద విషయం. నాకు నిర్మాణం పట్ల ఒక అవగాహన ఉండటంతో నా పరిధిలో నేను ఉండి ఈ ప్రాజెక్టు చేశాను. హర్ష గారి సహకారం, వివేక్ సాగర్ సంగీతం అందించడం మాకు బాగా బలాన్ని ఇచ్చింది. ఈ చిత్ర బృందం అందరికీ థాంక్స్” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here