త్రికాల మూవీ రివ్యూ

0
8

త్రికాల మూవీ రివ్యూ

సినిమా: త్రికాల – స్క్రిప్ట్ ఆఫ్ గాడ్
విడుదల తేదీ: 28 మే 2026
సీబీఎఫ్‌సీ రేటింగ్: A
రన్‌టైమ్: 2గం 7ని
తారాగణం: అజయ్, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, సాహితి అవంచ, నందా దురైరాజ్, ఆమని, సాహితి అవంచ, సాయి ధీనా, రోబో శంకర్, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్, అంబటి అర్జున్, స్పైడర్ సంజయ్, కల్లూరి వినోత్
డీవోపీ: పవన్ చెన్నా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: షాజిత్ హుమాయున్
సమర్పణ: రిత్విక్ వెట్షా
కో ప్రొడ్యూసర్: శ్రీ సాయిదీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి
నిర్మాత: రాధికా శ్రీనివాస్
రైటర్ – ఎడిటర్ – డైరెక్టర్: మణి తెల్లగూటి

త్రికాల అనేది తెలుగులో కొత్త మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్. దర్శకుడు మణి తెల్లగూటి కర్మ, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయాన్ని ఒకే ఫ్రేమ్‌లో చూపించాడు. చాగంటి ప్రొడక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. టీజర్, ట్రైలర్ చూసినప్పటి నుంచే తుంబాడ్, కాంతార తరహా డార్క్ మిస్టిక్ వరల్డ్ గుర్తుకు వచ్చింది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం విజువల్‌గా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

కథ

శతాబ్దాల క్రితం కుమారి ఖండంలో మునులు తాంత్రిక గ్రంథాలను అసురుల నుంచి కాపాడేందుకు శక్తి ఏథా అనే దైవిక ఆయుధాన్ని సృష్టిస్తారు. వీరరాజు త్రికాల వర్మ ఆ ఆయుధంతో పోరాడి మరణిస్తాడు. మునులు అతని ఆత్మను మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రమాదం వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని చెబుతారు. ప్రస్తుత కాలంలో శివ అనే యువకుడు తప్పిపోయిన ప్రేయసి నిధి కోసం నగరానికి వస్తాడు. అతని వద్ద దుష్టశక్తి ఉన్న ఫోన్ ఉంటుంది. ఈ క్రమంలో సూర్యకాంతి పడని వైతరణ్‌ను కలుస్తాడు. వైతరణ్ నిజానికి త్రికాల వర్మ పునర్జన్మ. కుటుంబ బాధలతో తండ్రిని, పినతల్లిని చంపి తాను చనిపోతాడు. కానీ అతని ఆత్మ బంగ్లాలో తిరుగుతూ ఉంటుంది. సైకియాట్రిస్ట్ మాయ అక్కడ చిక్కుకుంటుంది. అసుర రాజు మళ్లీ లేవడానికి సిద్ధమవుతాడు. దర్వాడి తెగ అండాన్ని యాక్టివేట్ చేయడం, దానితో శివకు ఉన్న సంబంధం మిగిలిన కథను నడిపిస్తాయి.

నటీనటుల పనితీరు

అజయ్ వైతరణ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. మానసిక ఒత్తిడి, భయం, దుష్టశక్తి మధ్య చిక్కుకున్న మనిషి కల్లోలాన్ని కళ్లతోనే పలికించాడు. ప్రత్యేక మాస్క్, కాస్ట్యూమ్‌తో పాటు అతని కదలికలు పాత్రకు బలం ఇచ్చాయి. బాధను, కోపాన్ని ఒకేసారి చూపించే సన్నివేశంలో గుర్తుండిపోతాడు. మాస్టర్ మహేంద్రన్ శివగా సహజంగా నటించాడు. అమాయకత్వం, ప్రేమ, భయం, బాధ అన్ని ఎమోషన్స్ సులువుగా పలికించాడు. క్లైమాక్స్ సీన్లలో అతని కన్నీళ్లు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. శ్రద్ధా దాస్ మాయ పాత్రలో మిస్టరీని కంట్రోల్డ్ యాక్టింగ్‌తో చూపించింది. గ్లామర్ కంటే సైలెన్స్‌తో భయం పుట్టించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ డార్క్ టోన్‌కు సరిపోయింది. సీనియర్ ఆమని పినతల్లిగా తల్లిప్రేమ, భయం, అనుమానం చాలా సహజంగా చూపించింది. ఆమె అనుభవం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. నలుగురు నటులు కథకు ప్రాణం పోశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

టెక్నికల్‌గా త్రికాల ఉన్నత స్థాయిలో ఉంది. మణి తెల్లగూటి ప్రతి ఫ్రేమ్‌ను డార్క్ లాంగ్వేజ్‌తో డిజైన్ చేశాడు. నీడలు, ఖాళీ కారిడార్లు, నెమ్మదైన కెమెరా భయం కలిగిస్తాయి. పవన్ చెన్నా కెమెరా గోల్డెన్ లైట్, ఇంక్ బ్లాక్ టోన్స్‌తో పెయింటింగ్‌లా చూపించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్, షాజీత్ హుమాయూన్ బీజీఎం సౌండ్ డిజైన్‌తో భయాన్ని పెంచాయి. వీఎఫ్‌ఎక్స్ కథలో కలిసిపోయి బాగుంది. రాధికా శ్రీనివాస్ నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. చివరగా, త్రికాల రొటీన్ హారర్ కాదు. మైథాలజీ, సైకాలజీ, డార్క్ ఫాంటసీ ఇష్టపడే వారికి ఇది కొత్త అనుభవం.

హైలైట్స్
కొత్త కాన్సెప్ట్
గ్రిప్పింగ్ విజువల్స్
అజయ్ నటన
బలమైన బీజీఎం

డ్రాబ్యాక్స్
భారీ కథనం
నెమ్మదైన నేరేషన్

విశ్లేషణ

మొదటి భాగం త్రికాల ప్రపంచాన్ని నెమ్మదిగా బిల్డ్ చేస్తుంది. కుమారి ఖండం, మాయా అండం, పునర్జన్మ కాన్సెప్ట్‌ను విజువల్స్‌తో చెబుతాడు దర్శకుడు. శివ నగరానికి రావడం, వైతరణ్ పరిచయం, మాయ ఎంట్రీ వరకు కథ ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ వీఎఫ్‌ఎక్స్‌తో గ్రాండ్‌గా ఉంటుంది. రెండో భాగం తాంత్రిక రిచ్యువల్స్, ట్రామా, త్రికాల వర్మ తిరిగి రావడం చుట్టూ తిరుగుతుంది. మధ్యలో కొన్ని సీన్లు భారంగా అనిపించినా, శివ ఎమోషన్, మాయ కాన్ఫ్లిక్ట్ కథను నిలబెడతాయి. క్లైమాక్స్ విజువల్‌గా రిచ్‌గా ఉండి కర్మ సిద్ధాంతాన్ని ముగిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ వరల్డ్ బిల్డింగ్, సెకండ్ హాఫ్ ఎమోషన్, యాక్షన్‌తో బ్యాలెన్స్ చేసింది. తెలుగులో ఇలాంటి ప్రయోగం అభినందించదగినది.

రేటింగ్: 3/5

చివరగా: మైథాలజీ, డార్క్ ఫాంటసీ ఇష్టపడే వారికి కొత్త అనుభవాన్నిచ్చే త్రికాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here