దర్శక రత్న దాసరి నారాయణరావు గారి స్మారక స్థలాన్ని శుభ్ర పరిచిన విష్ణు మంచు టీం
“ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారి స్మారక స్థలం శిధిలావస్థలో ఉందని చూపించిన ఒక వీడియోను చూసిన వెంటనే విష్ణు మంచు స్పందించారు. ఆలస్యం చేయకుండా తన బృందాన్ని అక్కడికి పంపించి, స్మారక స్థలం పరిసరాలను శుభ్రపరచడంతో పాటు పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా ఆదేశించారు. వారి చొరవతో ఆ ప్రదేశం తిరిగి పరిశుభ్రంగా, గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. దాసరి నారాయణరావు గారి వారసత్వానికి తగిన గౌరవాన్ని అందించేలా ఈ చర్యలు చేపట్టడం విశేషం.”



