హౌస్‌ఫుల్ షోలతో విజయవంతంగా దూసుకెళ్తున్న “నేనెవరు?”.. పెరుగుతున్న థియేటర్లు, అద్భుతమైన ప్రేక్షకాదరణ!
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక వినోదాత్మక చిత్రం “నేనెవరు?” మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి తెలిపారు.
సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అనేక కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో ప్రదర్శితమవుతోందని వారు వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని, మరిన్ని కేంద్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. “నేనెవరు?” చిత్రానికి ప్రేక్షకులు ఇంత గొప్ప ఆదరణ అందించడం చాలా ఆనందంగా ఉందని, మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం సంతోషకరమని అన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరించడం తనకు మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. చిత్ర దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అలాగే సాయికిరణ్, జోగిని శ్యామల తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని, సినిమాలోని భావోద్వేగాలు, సందేశాత్మక అంశాలు, కోర్టు సన్నివేశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.
దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన కథనం, చిన్నికృష్ణ అందించిన సంగీతం, నాయుడు ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ, నందమూరి హరి – తారకరామారావు ఎడిటింగ్, శ్రీనివాస్ మాటలు, ఎస్.ఎస్. వీరు రాసిన పాటలు చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయని నిర్మాతలు తెలిపారు.
“సినిమా చాలా బాగుంది”, “మంచి సందేశంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్”, “ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం” అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారని, ప్రేక్షకుల ఆదరణతో “నేనెవరు?” విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరిన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శనకు డిమాండ్ పెరుగుతోందని వారు వెల్లడించారు. సమర్పణ: సరికొండ మల్లిఖార్జున్
నిర్మాతలు: అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి
రచన – దర్శకత్వం: చిరంజీవి తన్నీరు
సంగీతం: చిన్నికృష్ణ
సినిమాటోగ్రఫీ: నాయుడు ప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: నందమూరి హరి – తారకరామారావు
మాటలు: శ్రీనివాస్
పాటలు: ఎస్.ఎస్. వీరు
PRO: రాంబాబు మీడియా హౌస్
కో-డైరెక్టర్: కట్టా జై



