‘ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును ‘ మూవీ రివ్యూ

0
134

‘ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును ‘ మూవీ రివ్యూ

చిత్రం: ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును

విడుదల తేదీ: 03 ఏప్రిల్ 2026

సెన్సార్ రేటింగ్: A 

నిడివి: 2 గంల 29 నిలు

నటీనటులు: సుధాకర్ మస్కూరి, శివరాజ్ శంకర్, కృతి ఆర్ భట్, సురేష్ ఎస్ కె, ప్రసూన వీరన్, నివిక్ష నాయుడు

సంగీతం: కళ్యాణ్ కీస్, ప్రశాంత్ మార్క్, నవీన్, చరణ్

సినిమాటోగ్రఫీ: రాజేష్ కుర్ర

నిర్మాత: ఆంజనేయులు పిట్ల 

రచన, దర్శకత్వం: అంజనీదాస్

ఏప్రిల్ 3, 2026న విడుదలైన ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం. ఈ రోజుల్లో ప్రేమ అనేది ఒక పవిత్రమైన అనుబంధం కంటే కూడా ఒక వ్యాపార లావాదేవీగా మారిపోతుందా? అనే కఠినమైన వాస్తవాన్ని వెండితెరపై నిజాయితీతో ఆవిష్కరించిన ఈ చిత్రం నేటి తరం ప్రేమను ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేసింది. దర్శకుడు అంజనీదాస్ తన శైలిలో ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కథను మన ముందుకు తీసుకొచ్చారు. సినిమాలో సుధాకర్ మాస్కూరి, శివరాజ్ శంకర్, కృతి ఆర్ భట్, నివిక్ష నాయుడు ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ:

కథ విక్కీ (సుధాకర్ మాస్కూరి) అనే ఒక చైన్ స్నాచర్ చుట్టూ తిరుగుతుంది. మరోవైపు ప్రేమను వ్యాపారంగా చూసే మనుషుల మధ్య ఇరుక్కున్న ఒక ఫిలిం మేకర్ ఆలోచనలతో విక్కీ జీవితం ఎలా ముడిపడింది అన్నదే అసలు పాయింట్. ప్రేమను డబ్బుతో కొనే యుగంలో మనం జీవిస్తున్నామా? లేక అది ఇంకా భావోద్వేగాలకు సంబంధించినదేనా? అనే ప్రశ్నలను సినిమా మన ముందుకు తీసుకొస్తుంది.

నటీనటుల పనితీరు:

ఈ సినిమా ప్రధాన బలం ఇందులోని నటీనటులు. కొత్తవాళ్లు అయినప్పటికీ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సుధాకర్ మాస్కూరి విక్కీ పాత్రలో ఒదిగిపోయారు. ఆ పాత్రలోని ఒక రఫ్‌నెస్, ఎమోషనల్ డెప్త్ రెండింటినీ బాగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. శివరాజ్ శంకర్ తన పాత్రలో ఒక నేచురల్ హీరోయిజం చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు. ఒక అనుభవం ఉన్న నటుడిలా రాణించారు. కృతి ఆర్ భట్ మరియు నివిక్ష నాయుడు తమ పాత్రల్లో ఫ్రెష్‌నెస్ తీసుకువచ్చారు. కథకు గ్లామర్‌తో పాటు ఎమోషనల్ టచ్ ఇచ్చింది ఈ ఇద్దరే. కృతి తన పాత్రలో ఉన్న ఫ్రెష్‌నెస్‌ను బాగా క్యారీ చేయగా, నివిక్ష తన నటనతో కీలక మలుపులకు బలాన్ని ఇచ్చింది. ఇతర సహాయ పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరూ సినిమా మూడ్‌కు తగినట్లుగా సహజమైన నటనను కనబరిచారు. 

సాంకేతిక నిపుణుల పనితీరు:

సాంకేతిక పరంగా ఈ సినిమా ఒక మంచి ప్రయత్నం. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. బస్తీల్లోని విజువల్స్, నైట్ షాట్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. సంగీతం మరియు నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ను సరిగ్గా ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉండి, అనవసరమైన సాగతీత లేకుండా చూసుకున్నారు. దర్శకుడు అంజనీదాస్ తన మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్‌ను ఎంచుకుని, దానిని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి ప్రెజెంట్ చేయడం గొప్ప విషయం. 

ప్లస్ పాయింట్స్

యూనిక్ & బోల్డ్ కాన్సెప్ట్

యూత్ రిలేటబుల్ కంటెంట్

ఫస్ట్ హాఫ్‌లో ఎనర్జీ

డైలాగ్స్ & రియలిస్టిక్ టేకింగ్

మైనస్ పాయింట్స్

ప్రొడక్షన్ వాల్యూస్ మరింత మెరుగ్గా ఉండాల్సింది

కొన్ని బోల్డ్ సీన్స్ అన్ని రకాల ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవచ్చు

విశ్లేషణ:

సినిమా ప్రారంభం నుండే దర్శకుడు కథలోకి నేరుగా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా, ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ సీన్స్ తీసిన విధానం, ఆ వాతావరణం చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. డైలాగ్స్ నేటి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. రెండవ భాగంలో కథ కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది, కానీ సాంకేతికంగా సినిమా సరైన స్థాయిలో ఉంది. మొత్తంగా చూస్తే, “ఇచట లవ్ అమ్మబడును కొనబడును” ఒక సాధారణ ప్రేమ కథ మాత్రం కాదు, దాని లోపల సమాజంపై, సంబంధాలపై ఒక గట్టి సందేశం ఉంటుంది.అక్కడక్కడా కథనం కొంచెం నెమ్మదించినట్లు అనిపించినా, క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఆ ఎమోషన్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ఒక ముగింపునిస్తూ, సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వడంలో దర్శకుడు సఫలమయ్యారు.

రేటింగ్: 2.75/5

చివరగా: యూత్‌ని ఆలోచింపజేసే బోల్డ్ సినిమా.. ప్రేమలోని నిజాయితీని వెతికే ప్రయాణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here