భక్తి ద్వారా ప్రజలకు మనశ్శాంతి కలుగుతుంది అంటూ సబ్స్క్రిప్షన్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అనన్య నాగళ్ళ

0
24
Ananya Nagalla

భక్తి ద్వారా ప్రజలకు మనశ్శాంతి కలుగుతుంది అంటూ సబ్స్క్రిప్షన్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అనన్య నాగళ్ళ – సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన డబ్బులు అనాధ బిడ్డలకు

ఇటీవల కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్యూసర్లు, సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ లోని సబ్ సెక్షన్ ఆప్షన్ ద్వారా 390 రూపాయలకి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ మొదలు పెట్టడం చూస్తున్నాం. అయితే అదే తరహాలో టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో సబ్స్టేషన్ తీసుకోవడంపై అనేక రకాలుగా వాగ్వాదాలు వినిపిస్తున్నాయి. కేవలం సబ్స్రిప్షన్ అనేది ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడడానికి మాత్రమే కావడంతో ఇది హైప్ పెంచే ఒక స్ట్రాటజీ లాగా మాత్రమే ఉన్న సమయంలో అనన్య నాగళ్ళ ఈ సబ్స్క్రిప్షన్ పై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది.

“నేను ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా నా అభిమానులకు, ప్రజలకు దగ్గర కావడం కోసం మాత్రమే నేను ఈ ఆప్షన్ ఎంచుకున్నాను. తద్వారా నా జీవితంలో నాకు జరిగినవి, జరుగుతున్నవి ప్రజలకు తెలియజేసి నాకు తోచిన విధంగా అందరికీ సహాయపడాలనే సదుద్దేశంతోనే నేను సుబ్స్క్రిప్షన్ ఎంచుకున్నాను. సాధారణంగా 21 రోజుల పాటు రోజుకు 108 సార్లు ‘ఓం నమః శివాయ’ అనుకుంటూ జపం చేయడం ద్వారా మనశ్శాంతిగా ఉంటుందని, అలా ఎవరైతే 21 రోజుల పాటు జపం చేస్తారో వారికి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేద్దాం” అంటూ ఆమె తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో అనన్య నాగళ్ల ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పై ఇప్పటివరకు ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం వచ్చింది. ఈ విషయంపై గత కొన్ని రోజులగా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. అదేవిధంగా ఈ సుబ్స్క్రిప్షన్స్ ద్వారా వచ్చిన డబ్బును చారిటీ ద్వారా అనాధ పిల్లలకు సహాయం చేసే విధంగా వారికి డొనేట్ చేయాలనుకుంటున్నాను అని ఆమె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here