‘బరి’ సినిమా చిత్రీకరణ కోసం వాలీబాల్ ట్రైనింగ్ సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  మోకాలి గాయం..  శస్త్ర చికిత్స పూర్తి

0
66
Varun Tej Injured In Bhari
Varun Tej Injured In Bhari
‘బరి’ సినిమా చిత్రీకరణ కోసం వాలీబాల్ ట్రైనింగ్ సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  మోకాలి గాయం..  శస్త్ర చికిత్స పూర్తి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. రీసెంట్‌గానే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా వ‌రుణ్ తేజ్ వాలీ బాల్ ఆట‌ను ప్రాక్టీస్ చేస్తుండ‌గా మోకాలికి తీవ్ర గాయ‌మైంది. ఈ మోకాలి గాయానికి సంబంధించి వ‌రుణ్ తేజ్‌కు శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. ఈ విష‌యాన్ని నిహారిక త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు.

‘నా సోద‌రుడు వ‌రుణ్ తేజ్ ఇటీవ‌ల మేం రూపొందిస్తోన్న బ‌రి సినిమా కోసం వాలీబాల్‌ను ప్రాక్టీస్ చేస్తుండ‌గా మోకాలికి తీవ్ర గాయ‌మైంది. తాజాగా ఆయ‌న్ని ప‌రిశీలించిన డాక్ట‌ర్స్ మోకాలికి ఆపరేష‌న్ చేశారు. ఈ శ‌స్త్ర చికిత్సను వైద్యులు చ‌క్క‌గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ అన్న‌య్య డాక్ల‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటార‌ని భావిస్తున్నాం. ఈ స‌మ‌యంలో మాకు అండ‌గా నిల‌బ‌డి ప్రేమాభిమానాలు చూపించిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు’ అని నిహారిక పేర్కొన్నారు.

Varun Tej Injured In Bhari
Varun Tej Injured In Bhari

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here