అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అర్జున్ మహీ.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ

0
16

అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అర్జున్ మహీ.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ

‘ఇష్టంగా’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన అర్జున్ మహీ, ఆ తరువాత ‘ఎంజాయ్’, ‘నువ్వు నేను ఒరేయ్ ఒసేయ్’ వంటి చిత్రాలతో తనదైన ప్రయత్నాలు చేశాడు. కొంత గ్యాప్ తర్వాత తాజాగా ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో మళ్లీ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.

ఈ చిత్రంలో హీరోయిన్ అన్న పాత్రలో అర్జున్ మహీ అద్భుతంగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా హీరోతో ఆయనకు వచ్చే సన్నివేశాలు, ఇద్దరి మధ్య ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అర్జున్ చేసిన పర్ఫామెన్స్‌కి ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ పాత్ర కోసం అర్జున్ మహీ ఏకంగా 15 కేజీల బరువు పెరిగి, క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడు. పాత్ర కోసం ఎంతైనా శ్రమించేందుకు సిద్ధంగా ఉంటాడనడానికి ఇదే నిదర్శనం.

ప్రస్తుతం అర్జున్ మహీ మంచి కథలు, బలమైన పాత్రలపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే హీరోగా రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ను ఓకే చేసిన ఆయన, త్వరలోనే అవి సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.
హీరో పాత్రలతో పాటు కథను మలుపు తిప్పే కీలక పాత్రలు చేయాలనే కోరిక కూడా ఉందని అర్జున్ మహీ వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here