‘ఛాంపియన్’తో హాట్ టాపిక్.. నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యశ్ రంగినేని

0
113

‘ఛాంపియన్’తో హాట్ టాపిక్.. నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యశ్ రంగినేని

యశ్ రంగినేని నిర్మాతగా మంచి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.

ఇక నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూనే నటుడిగా తన సత్తాను ప్రదర్శించుకుంటున్నారు. తాజాగా జాతీయ అవార్డ్ గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రోషన్ మేక హీరోగా వచ్చిన ఈ చిత్రంలో యశ్ రంగినేని ఓ అద్భుతమైన పాత్రను పోషించారు. వీరయ్య అనే అద్భుతమైన రోల్‌లో యశ్ రంగినేని అంతే గొప్పగా జీవించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్‌లో యశ్ రంగినేని నటన అందరికీ గుర్తుండిపోతుంది.

 

‘ఛాంపియన్’ చిత్రంలో ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రని యశ్ రంగినేని చాలా గొప్పగా పోషించి అందరి చేత మన్నల్ని పొందారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here