వరల్డ్ వైడ్ 28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను హత్తుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటిదాకా 28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. స్టడీ కలెక్షన్స్ తో “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ అన్ని సెంటర్స్ లో ప్రదర్శితమవుతోంది.
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు.
నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను, ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్



