చార్ట్‌బస్టర్‌గా కొత్త జానపద బీట్ ‘ ఇది మా వోడి పెళ్లి’
ఇండిపెండెంట్ ఫోక్ బీట్ పాటలు ఎంతగానో అలరిస్తున్న ట్రెండ్ లో కొత్తగా వచ్చిన, ‘ఇది మా వోడి పెళ్లి’ వీడియో సాంగ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ట్రెండింగ్ లో సాగుతోంది. ‘SR ఫోక్స్’ విడుదల చేసిన ఈ ఎనర్జిటిక్ జానపద ట్రాక్, ఫోక్ వైబ్ తో ఉత్సాహపరిచే బ్రిజేష్ గాత్రంతో, ఎ బి డి ఉల్లాసమైన బీట్‌లు, సినిమాటిక్ ఆర్కెస్ట్రేషన్‌లో అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు YouTubeలో ఉన్న ఈ మ్యూజిక్ వీడియో, వెంకట్ రోంపెల్లి మరియు పానుగంటి రవిల ఉత్సాహభరితమైన డాన్స్ తో బ్రిజేష్ గాత్రాలతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ABD సంగీతం మరియు సాహిత్యం పాటను మొదటి సారి వింటున్నప్పుడే పాడుకునేలా ఉన్నాయి. జహీర్ దర్శకత్వం వహించిన ఈ విజువల్స్ ప్రేక్షకులను పార్టీ మోడ్‌లో ఉన్న స్థానిక గ్రామీణ బార్ సెట్టింగ్‌కు తీసుకువెళతాయి, బీట్‌కు అనుగుణంగా ఉండే మూడ్ లోసాగే పాట రాబోయే ప్రతి పెళ్ళి, పార్టీలలో వినిపించడం ఖాయం.
బీట్ మరియు సాహిత్యం విన్న వెంటనే గుర్తుండిపోయేలా ఉండడం విశేషం, మొదటి విన్నప్పటి నుండి పాడటానికి అనువుగా ఉండి. గ్రామీణ జానపద సాహిత్యం కనెక్ట్ అవుతుంది. ‘ఇది మా వోడి పెళ్లి’ ఇప్పటికే చార్టుల్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరు జానపద బీట్ ఇష్టపడే వారైనా లేదా ఫుట్‌ట్యాపింగ్ ఎనర్జిటిక్ పాటను ఇష్టపడే వారైనా, వెంకట్ రొంపెల్లి మరియు పానుగంటి రవి ఎనర్జిటిక్ డాన్స్ తో ఈ పాట ఆకట్టుకుంటుంది.
‘ఇది మా వోడి పెళ్లి’ పాటను రిపీట్ మోడ్ లో ఎంజాయ్ చేయండి.



