‘రోలుగుంట సూరి’ మూవీ రివ్యూ
తెలుగు తెరపై రియలిస్టిక్ విలేజ్ ఎమోషనల్ డ్రామా చాలా తక్కువగా తెరకెక్కుతుంటాయి. అలాంటి అరుదైన చిత్రం ‘రోలుగుంట సూరి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరో–హీరోయిన్లుగా నటించగా, తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించారు. రియల్ స్టోరీ గా చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ:
రోలుగుంట అనే గ్రామంలో జరిగిన కథ ఈ సినిమా. జైలు నుండి తిరిగి వచ్చిన తక్కువ కులానికి చెందిన యువకుడు సూరి, గ్రామంలో తన కష్టంతో, నిజాయితీతో గౌరవం సంపాదించుకుంటాడు. కమల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే గ్రామంలో జరిగే కబడ్డీ దగర గొడవలు మొదలవుతాయి. పైవర్గానికి చెందిన ప్రెసిడెంట్ మరియు కాషి, అతడి గ్యాంగ్‌తో సూరికి విభేదాలు ఏర్పడుతాయి. కులం, క్లాస్, ఆత్మగౌరవం కోసం జరిగే చిన్న గొడవలు పెద్ద గొడవలుగా మారతాయి. సూరిపై, దాడులతో, “అంటరాని కులం” అంటూ సూరి కుటుంబాన్ని అవమానాలకు గురి చేస్తూ చివరికి ప్రెసిడెంట్ మనుషులు సూరి తల్లిదండ్రులను ఇంటితో సహా అగ్గి పెట్టి కాల్చేయడం వరకు తెగిస్తారు. ఈ సంఘటనల వెనుకున్న అసలు నిజం ఏమిటి? సూరి తన పగను తీర్చుకున్నాడా? తర్వాత జరిగిన కథేంటి అనేది ట్విస్టులతో సాగుతూ రియల్ స్టిక్ గా సాగే సినిమాలో రెవీల్ అవుతాయి.
నటీనటుల పనితీరు:
నాగార్జున పల్లా సూరిగా పాత్రలో సరిపోయాడు. గ్రామీణ యువకుడి భాష, మైనర్, బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా నేచురల్‌గా చేశారు. ఆధ్యారెడ్డి, కమల పాత్రలో కావలసిన సున్నితత్వాన్ని , హుందాగా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్రలో బాగా చేసింది. భావోద్వేగ సీన్లలో తన నటనాతో ఆకట్టుకుంది. ఇక భావన నీలప్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్‌లో మంచి ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటూ తన. పాత్రకు న్యాయం చేసింది. బ్రహ్మనందరెడ్డి విలన్ షేడ్ పాత్రలో పవర్‌ఫుల్‌గా నటించాడు తన బాడీ లాంగ్వేజ్, డైలోగ్ డెలివరీ తో పాత్రను మరింత రక్తి కట్టించారు. సత్యనారాయణ, అయూషా, జ్యోతి, మహర్షి రమణ.. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు సరిపోయేలా చేస్తూ, కథలో కీలకమైన చోట్ల వీరి నటనతో డెప్త్ వచ్చేలా చేశారు .
సాంకేతిక నిపుణుల పనితీరు
గ్రామీణ నేపథ్యంలో రియలిస్టిక్ సినిమా తీయడం సులభం కాదు. అయితే దర్శకుడు అనిల్ కుమార్ పల్లా చాలా సమర్థవంతంగా తెరకెక్కించారు. ఆసక్తికరమైన కథనంతో ఎక్కడా లాగ్ అనిపించకుండా తీయడం విశేషం. డైరెక్టర్ స్వయంగా చేసిన కెమెరా వర్క్ కూడా విలేజ్ రియలిస్టిక్ ఫీల్ తీసుకొచ్చింది. ఇది సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది.
సుభాష్ ఆనంద్ అందించిన సంగీతం సినిమాకు కావాల్సిన రస్టిక్, నేటివ్ ఫ్లేవర్ ఇవ్వడంలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండు కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రామారావు మాతుమూరు రాసిన ‘నిన్న.. మొన్న..’ పాట సినిమాకు ఆత్మగా నిలిచింది. అనూప్ రూబెన్స్ విడుదల చేసి, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ప్రత్యేకంగా ప్రశంసించినట్టు ఈ పాట సినిమాకి ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చింది. సందీప్ చక్రవర్తి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో సన్నివేశాలలో టెన్షన్, ఎమోషన్, ఇంటెన్సిటీని పెంచారు.
ఆవుల వెంకటేష్ ఎడిటింగ్ & స్క్రీన్‌ప్లే తో సినిమా ఫాస్ట్ పేస్ తో వెళ్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లు, హై వోల్టేజ్ సీన్లు బాగా సెట్ చేశారు. అక్కడక్కడ కొంచం ట్రిమ్ చేయాల్సింది. ఇక డీఐ కూడా సినిమాను విజువల్ గా మరో స్థాయికి తీసుకెళ్లింది. మహ్మద్ సాయి రాసిన కథ, డైలాగ్స్ గ్రామీణ మాటల బలాన్ని చక్కగా రిఫ్లెక్ట్ చేసింది. డైలాగ్స్ చాలా నాచురల్ గా ఉన్నాయి. వాసు ఫైట్స్ విలేజ్ ఫైట్స్ ఎలా ఉంటాయో అలా తీశారు. ఎస్. రమేష్ ఆర్ట్ డైరెక్షన్ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిఫలించేలా ఉంది.
విశ్లేషణ:
గ్రామీణ వాస్తవాలను, కుల వ్యవస్థను డైరెక్టర్ అనిల్ కుమార్ పల్లా నిజాయితీగా చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. సూరి తల్లిదండ్రుల మీద దాడి సీన్ హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఫైట్స్ చాలా ఎఫెక్టివ్‌గా, రియలిస్టిక్ టచ్‌తో చేశారు. రొమాన్స్ యూత్‌ను బాగా ఆకట్టుకునేలా చూపించారు. తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించేంత బోల్డ్‌గా, నేచురల్‌గా శృంగారం సీన్లు తెరకెక్కించారు. గ్రామీణ వాతావరణం, కలర్ టోన్, లోకేషన్స్ అన్ని కలిసి సినిమా పూర్తిగా రియల్ విలేజ్ ఫీల్ ఇస్తుంది
‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ ఎమోషనల్ డ్రామా, కులం, ప్రేమ, ప్రతీకారం, గ్రామీణ సత్యాలు అన్నీ మిళితమైన సినిమా. ప్రతి విభాగం తమ వంతు న్యాయం చేశాయి. టాలీవుడ్ లో అరుదైన, అద్భుతమైన విలేజ్ సినిమాగా నిలుస్తుంది.
రేటింగ్: 3 / 5
చివరగా: రియలిజం, ఎమోషన్, ఇంటెన్సిటీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులకు ఇది తప్పకుండా నచ్చే సినిమా.



