త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ తో ప్రారంభం కానున్న ‘వారణాసి ‘
రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’
సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేస్తూ రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతో ఉన్న చిత్రం ‘వారణాసి’ . ‘రఫ్’ చిత్ర దర్శకుడు సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే గ్రాండ్ ఓపెనింగ్ తో ఈ మూవీని ప్రారంభించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలియజేస్తూ పక్కా మాస్ కమర్షియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటిస్తుండగా, మరో స్టార్ డైరెక్టర్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
భారతదేశంలో అతి పవిత్ర ప్రదేశమైన వారణాసి పుణ్యక్షేత్రంలోనే షూటింగ్ మొత్తం జరుగుతందని దర్శకుడు సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తామని రామభక్త హనుమా క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది.



