ZEE5లో తెలుగు, హిందీ భాషల్లోకి ఆగస్ట్ 1న రాబోతోన్న ‘సట్టముమ్ నీతియుమ్’ భావోద్వేగాలతో నిండిన కోర్ట్ రూమ్ డ్రామా

0
176
Sattamum Neethiyum ON ZEE5
Sattamum Neethiyum ON ZEE5

ZEE5లో తెలుగు, హిందీ భాషల్లోకి ఆగస్ట్ 1న రాబోతోన్న ‘సట్టముమ్ నీతియుమ్’ భావోద్వేగాలతో నిండిన కోర్ట్ రూమ్ డ్రామా

ZEE5 ఎప్పుడూ కూడా డిఫరెంట్ కంటెంట్, విభిన్న చిత్రాల్ని, సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సట్టముమ్ నీతియుమ్’ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి రాబోతోంది. జూలై 18 నుంచి ఆల్రెడీ తమిళ వర్షెన్ ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్లు ప్రకటించారు.

శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన ఘర్షణలతో నిండిన ఈ సిరీస్ ఆగస్ట్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సట్టముమ్ నీతియుమ్‌’ను బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించారు. 18 క్రియేటర్స్ బ్యానర్‌పై శశికళ ప్రభాకరన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఆగస్ట్ 1న తెలుగు, హిందీ భాషల్లోకి ఈ సిరీస్ రాబోతోన్న తరుణంలో

నటుడు శరవణన్ మాట్లాడుతూ .. ‘‘సట్టముమ్ నీతియుమ్’ కథ విన్న వెంటనే అది నా మనసును తాకింది. ఇది రెగ్యులర్ కోర్ట్ డ్రామా కాదు. ఈ కథ సామాన్యుడి బలం గురించి మాట్లాడుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడే ఓ కామన్ మెన్‌ను చూపిస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులో నేను భాగం అవ్వాలని కథ విన్నవెంటనే నిర్ణయించుకున్నాను. 15 ఏళ్ల తరువాత మళ్లీ ఇలాంటి ఓ శక్తివంతమైన పాత్రను పోషించాను. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు బాలాజీ సెల్వరాజ్‌కు, ZEE5 టీంకి నేను కృతజ్ఞుడను. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

ZEE5 Tamil and Malyalam బిజినెస్ హెడ్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ మార్కెటింగ్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ .. ‘ZEE5లో మేము నిరంతరం వినోదాత్మకంగానే కాకుండా సామాజికంగా ముఖ్యమైన కథలను కూడా అందించడానికి ప్రయత్నిస్తాము. ‘సట్టముమ్ నీతియుమ్’తో న్యాయం, సత్యం వంటి అంశాలతో సామాజిక కథను అందించాం. ఆల్రెడీ తమిళంలో మా సిరీస్‌కు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు తెలుగు, హిందీ ప్రేక్షకుల ముందుకు మా సిరీస్ రాబోతోంది. అందరినీ మెప్పించేలా మా సిరీస్ ఉంటుంది’ అని అన్నారు. ఈ సిరీస్ ఆగస్ట్ 1 నుండి ZEE5 తెలుగు, హిందీ భాషల్లో ప్రసారం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here