“లవ్ జాతర” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

0
122
Love Jathara First Look Still
Love Jathara First Look Still

అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ మూవీ “లవ్ జాతర” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ క్రియేషన్స్ బ్యానర్ లో “సమ్మతమే” ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రానికి “లవ్ జాతర” టైటిల్ ఖరారు చేశారు. ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే టైటిల్ కు తగినట్లే కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా “లవ్ జాతర” సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా..సుజాత సిద్ధార్థ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. “లవ్ జాతర”కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ ఇవ్వబోతున్నారు.

నటీనటులు – అంకిత్ కొయ్య, మానస చౌదరి, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
బ్యానర్ – యూజీ ప్రొడక్షన్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
ప్రొడ్యూసర్ – కంకణాల ప్రవీణ
రచన , దర్శకత్వం – గోపీనాథ్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here