ఘనంగా “కొత్తగా ఉంది” చిత్ర హీరోలు హరికృష్ణ, రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు !

0
229
Kothaga Undi Heroes Birthday Poster
Kothaga Undi Heroes Birthday Poster

ఘనంగా “కొత్తగా ఉంది” చిత్ర హీరోలు హరికృష్ణ, రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు !

తొలి సినిమా తికమక తండా తోనే సూపర్ హిట్ కొట్టిన హీరోలు రామ్& హరి ,  సినీ రంగంలో తమదైన శైలిలో రాణిస్తున్న కవలలు ,నేడు యువ హీరోలు రామ్& హరి యొక్క జన్మదిన వేడుకలు, బంగాళాఖాతానికి అతి సమీపంలోని తీర ప్రాంతం మండలంలో జన్మించిన ఇద్దరు కవలలు నేడు టాలీవుడ్ రంగంలో దూసుకుపోతూ తమకంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న దివిషమ ప్రాంతంలోని కోడూరు మండలానికి  చెందిన యువ హీరోలు తిరుపతి రామ్&  హరి  తొలి చిత్రంతో సక్సెస్ సాధించి  సినీ రంగంలో రాణిస్తున్నారు.

కవలలుగా పుట్టిన హీరోలు తొలి చిత్రంలో కూడా కవలలుగా నటించి ప్రేక్షకులు యొక్క మన్ననలు   పొందుతున్నారు , కుమారులను ప్రోత్సహిస్తూ నిర్మాతకు మారిన తండ్రి…సినిమా రంగం మీద  కుమారులకి ఆసక్తి ఉండటంతో  యువ హీరోలు సినీ రంగ ప్రవేశంలో తండ్రి కీలక పాత్రను   పోషించారు
టి ఎస్ ఆర్ గ్రూప్స్  అధినేత  తిరుపతి శ్రీనివాసరావు యువ హీరో ల రామ్ & హరి తండ్రి కాగా, శ్రీనివాస రావు కుమారుల అభిరుచి అనుగుణంగా  వారిని ప్రోత్సహించారు.

టి ఎస్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై మొదటి సినిమా తికమకతాండ కు నిర్మాతగా వ్యవహరించి ఆ సినిమాలో వారి యొక్క కుమారులను హీరోలుగా పరిచయం చేసి  తొలి సినిమాను రూపొందించారు. రామ్ &హరి కవలలగా  నటించి ప్రేక్షకులు మెప్పించారు. టాలీవుడ్ లోని అగ్ర సినీ తారాగణంతో  ఈ సినిమాను చిత్రీకరించారు . వెండి తెరతో పాటు, ప్రస్తుతం ఈ సినిమా  ‘ఆహా’ లో  స్టీమింగ్ అవుతూ ప్రేక్షకులకు మన్నలను   పొందుతుంది. మొదటి సినిమానే 119 థియేటర్లపైగా రిలీజ్ చేశారు.

 ప్రస్తుతం టిఎస్ఆర్ మూవీ మేకర్స్   ఆధ్వర్యంలో శ్రీనివాస రావు కుమారుడు  హరికృష్ణ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 3 పేరుతో నిర్మిస్తున్న చిత్ర నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  పనులు జరుగుతున్నాయి.

 నేడు  యువ హీరోల పుట్టినరోజును పురస్కరించుకొని  ఆదివారం చిత్రానికి సంబంధించి ‘ఫస్ట్ లుక్’ ను విడుదల చేయనున్నట్లు నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here