“తమ్ముడు” నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘భూ అంటే భూతం..’ ఈ నెల 17న రిలీజ్

0
236
Thammudu First Single Announcement Poster
Thammudu First Single Announcement Poster

హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు, శిరీష్ కాంబినేషన్ క్రేజీ మూవీ “తమ్ముడు” నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘భూ అంటే భూతం..’ ఈ నెల 17న రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘భూ అంటే భూతం..’ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 17న సాయంత్రం 5గంటలకు ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తన మేనకోడలిని ఆడిస్తూ కథానాయకుడు పాడే సందర్భంలో ‘భూ అంటే భూతం..’ పాటను చిత్రీకరించారు. ఈ పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి ఆకట్టుకునేలా పాడారు.

నటీనటులు – నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – దిల్ రాజు, శిరీష్
రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here