‘మార్కో’ తరువాత షరీఫ్ మహమ్మద్  నిర్మిస్తున్న మ్యాసీవ్ ప్రాజెక్ట్ ‘కట్టలన్’ కీలక పాత్రలో సునీల్

0
134
Sunil In Kaattalan
Sunil In Kaattalan

‘మార్కో’ తరువాత షరీఫ్ మహమ్మద్  నిర్మిస్తున్న మ్యాసీవ్ ప్రాజెక్ట్ ‘కట్టలన్’ కీలక పాత్రలో సునీల్

బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్, తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా కట్టలన్ ను అనౌన్స్ చేశారు. ఇది పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ థ్రిల్లర్. ప్రముఖ నటుడు ఆంటోనీ వర్గీస్ (పేపే) హీరోగా నటిస్తున్నారు. దర్శకత్వం పౌల్ జార్జ్.

ఈ చిత్రంలో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సునీల్ స్టయిలీష్ లుక్ లో కనిపిస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ అదిరిపోయింది.

ఈ మూవీకి కాంతార 2 ఫేం అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే, చుట్టూ పడి ఉన్న మృతదేహాలు, ఏనుగు దంతాల మధ్య నిలబడి వుండటం కథలో ఉండబోయే వైలెన్స్  సూచిస్తోంది. మార్కో స్థాయిని మించి ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది.

జైలర్, లియో, జవాన్, కూలీ లాంటి చిత్రాలకు టైటిల్ ఫాంట్స్ డిజైన్ చేసిన ఐడెంట్ ల్యాబ్స్ ఈ సినిమాకి కూడా టైటిల్ డిజైన్ చేశారు.

కంటెంట్, మార్కెటింగ్ పరంగా క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుండగా, పేపే హై ఇంటెన్సిటీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో కట్టలన్ నిజంగా ఒక గొప్ప సినీ అనుభూతి కావడంలో సందేహమే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here