తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ప్రముఖ నిర్మాత సునీల్‌ నారంగ్‌  

0
188
Suniel Narang As President Of Telangana Chamber Of Commerce
Suniel Narang As President Of Telangana Chamber Of Commerce
తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ప్రముఖ నిర్మాత సునీల్‌ నారంగ్‌  

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్ గా ప్రముఖ నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఎన్నికయ్యారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. వైస్‌ ప్రెసిడెంట్స్‌గా రవీంద్ర గోపాల, ఉదయ్ కుమార్ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్ వి ఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్ర శేఖర్ రావు జే, ట్రెజరర్ గా సత్యన్నారాయణ గౌడ్.బి ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ని ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్ సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు. ఐ విల్ డూ మై బెస్ట్’అన్నారు

సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. ఇది 80వ జనరల్ బాడీ మీటింగ్. ది ఓల్డెస్ట్ ఛాంబర్. 80 ఏళ్ల క్రితం ఈ ఛాంబర్ పెట్టారు. నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’అన్నారు.

జెమినీ కిరణ్ మాట్లాడుతూ.. సునీల్ అండ్ టీం కి ఆల్ ది వెరీ బెస్ట్. కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు’తెలిపారు.

సురేష్ బాబు మాట్లాడుతూ….తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులందరికీ నా బెస్ట్ విషెస్. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఛాంబర్. సునీల్ అండ్ టీం కి ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు

కె ఎల్ దామోదర్ ప్రసాద్.. అందరికి నమస్కారం. ఇది వెరీ హ్యాపీ అకేషన్. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కొత్తగా ఎన్నికైన టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here