హిస్టారికల్ ఎపిక్ NBK111 అనౌన్స్‌మెంట్

0
250
NBK 111 Announcement Poster
NBK 111 Announcement Poster

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ హిస్టారికల్ ఎపిక్ NBK111 అనౌన్స్‌మెంట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నారు. ఆయన పుట్టినరోజు (జూన్ 10) పురస్కరించుకొని బాలకృష్ణ 111వ చిత్రం అధికారికంగా ప్రకటించారు. NBK111 చిత్రానికి బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారు. భారీ బ్లాక్ బస్టర్ హిట్ వీరసింహరెడ్డి తర్వాత ఇది వారి సెకెండ్ కొలాబరేషన్. ప్రస్తుతం ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మ్యాసీవ్ స్కేల్ లో నిర్మించనున్నారు.

అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో ఉగ్ర సింహం ఫెరోషియస్ ఇమేజ్ వుంది. దాని ముఖంలో సగం లోహ కవచం, మిగిలిన సగం వైల్డ్ గా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన ఇమేజ్ బాలకృష్ణ ఈ చిత్రంలో పోషించబోయే ఇంటెన్స్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తోంది.   

మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లతో అదరగొట్టే దర్శకుడు గోపీచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లోకి అడుగుపెట్టనున్నారు. బాలకృష్ణ కోసం ఆయన ఇంతకు ముందు చూడని అవతార్‌ను రూపొందిస్తున్నారు. ఇది గ్రాండియర్, హిస్టరీ, హై-ఆక్టేన్ యాక్షన్‌ను బ్లెండ్ చేసే ఒక ఎపిక్ స్టొరీ. పవర్ ఫుల్ అండ్ యూనిక్ గా వుండబోతున్న ఈ స్క్రిప్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.

మిగిలిన తారాగణం, సాంకేతిక సిబ్బందిని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.

తారాగణం: నందమూరి బాలకృష్ణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here