పత్రికా ప్రకటన
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ముఖ్యనగరాలలో
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
పాల్గొంటున్న టి.డి.జనార్థన్, నందమూరి రామకృష్ణ,
సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తదితరులు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని ముఖ్య నగరాలలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, సిబిఎన్ 75 ఇయర్స్ వేడుకల ఉమ్మడి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్ మరియు ప్రత్యేక అతిధి ఎన్టీఆర్ కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణలు పయనమై వెళ్లారు. ఎన్నారై టీడీపీ మరియు తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో మొదటిది జూన్ 6న న్యూజిలాండ్ రాజధాని అక్‌లాండ్‌లో జరుగుతున్నది. దీనికి తెలుగుదేశం శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ అశ్విన్ అట్లూరి కూడా పాల్గొంటున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణంరాజు జూమ్ ద్వారా పాల్గొంటున్నారు.
జూన్ 7న మెల్బోర్న్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిధి శ్రీ టి.డి.జనార్ధన్‌తోపాటు శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, శ్రీ బోడే ప్రసాద్, శ్రీ అశ్విన్ అట్లూరి పాల్గొంటున్నారు. జూమ్ ద్వారా శ్రీ రఘురామ కృష్ణంరాజు తమ సందేశాన్ని ఇస్తారు.
జూన్ 8న అడిలైడ్ నగరంలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, సిబిఎన్ 75వ జన్మదినం వేడుకలలో ముఖ్య అతిధులుగా శ్రీ టి.డి.జనార్ధన్, శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీ బోడే ప్రసాద్, శ్రీ నారా రోహిత్, శ్రీ అశ్విన్ అట్లూరి, శ్రీ నన్నూరి నర్సిరెడ్డి పాల్గొంటున్నారు.
జూన్ 9న సిడ్నీ నగరంలో జరిగే కార్యక్రమంలో శ్రీ టి.డి. జనార్ధన్, శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, శ్రీ బోడే ప్రసాద్, శ్రీ అశ్విన్ అట్లూరిలతోపాటు ప్రముఖ సినీ యువనటుడు శ్రీ నారా రోహిత్, తెలుగుదేశం సీనియర్ నేతచ టిటిడి సభ్యుడు శ్రీ నర్సిరెడ్డి పాల్గొంటారు.
జూన్ 11న బ్రిస్బేన్ నగరంలో జరిగే మినీమహానాడు, ఎన్టీఆర్ సినీవజ్రోత్సవ కార్యక్రమాల్లో శ్రీ టి.డి.జనార్ధన్, శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, శ్రీ బోడె ప్రసాద్, శ్రీ నారా రోహిత్, శ్రీ అశ్విన్ అట్లూరి, శ్రీ నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమాలలో స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి.



