అంగరంగ వైభవంగా సూపర్ స్టార్ కృష్ణ అవార్డ్స్
ఎఫ్ టీ పీ సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు దివంగత సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ కృష్ణ సూపర్ అవార్డ్స్ – 2025 పేరిట పలు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులతో పాటు సామాజిక సేవా రంగాలకు చెందిన నిష్ట్నాతులను సత్కరించారు.ప్రముఖ నటులు మురళి మోహన్, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రులు నాయక్ ,ఘజల్ శ్రీనివాస్,దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, ప్రముఖులు పాతూరి నాగభూషణం,ధర్మ ప్రచారక్ లు ముఖ్య అతిధులుగా విచ్చేసి సీనియర్ సినీ ప్రముఖులు సాంబశివ రావు, ఎన్ వీ సుబ్బరాజు, కళారత్న ఎస్ వీ రామారావు, మాధవరావు, దివంగత బి ఏ రాజు(వారి కుమారుడు శివకుమార్), సురేష్ కొండేటి, శుభోదయం సుబ్బారావు,రాయప్రోలు శ్రీనివాస్, మేడికొండ శ్రీనివాస్ చౌదరి,పద్మాలయ శర్మ, దాట్ల వాసు వర్మ మరియు ప్రముఖ విద్య వైద్య సేవారంగాలకు చెందిన నిష్ణాతులను సత్కరించారు.
ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ గారు నిజం గానే దేవుడని, ఎంతమంది నిర్మాతలను సాంకేతిక నిపులణి పరిశ్రమలో నిలబెట్టారో తాము స్వయంగా చూశామని, అలాగే ప్రతి సంవత్సరం ఎక్కువ చిత్రాలలో నటిస్తూ కళాకారులకు , కార్మికులకు అత్యధికంగా ఉపాధి కల్పించిన సూపర్ స్టార్ ఆయనని కొనియాడారు.ఆయన్ని గుర్తించుకొని ఇంతమందిని సన్మానించే కార్యక్రమాన్ని చేపట్టిన చైతన్య జంగా, పాకలపాటి విజయ్ వర్మ లు అభినందనీయులని పేర్కొన్నారు.సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ గతంలో ఎన్ టీ ఆర్ , ఏ ఎన్ ఆర్ , కృష్ణం రాజు గార్ల పేరిట అవార్డు లు ఇచ్చిన తాము రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరిట సినీ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన 12 రాష్ట్రాల ప్రముఖులను సత్కరించడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నామని అన్నారు.ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ కృష్ణ గారితో పనిచేసిన నిర్మాత , దర్శకులు , సాంకేతిక నిపుణులతో పాటు కృష్ణ గారి అభిమానులను కూడా పిలిపించి సూపర్ స్టార్ సూపర్ అవార్డు లు అందించామని , దివంగత సినీ ప్రముఖుల పేరిట తాము చేసే ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారు చిత్రపరిశ్రమకు చేసిన సేవలను నేటి తరం వారు తెలుసుకుంటారని తద్వారా వీరు పదిమందికి సహాయం అందించే బాధ్యత తీసుకుంటారన్న స్వార్ధమే మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు స్ఫూర్తి నిస్తోందని పేర్కొన్నారు.కృష్ణ గారి డేరింగ్ అండ్ డాషింగ్ ని పాతూరి నాగభూషణం, ఘజల్ శ్రీనివాస్, వీరశంకర్ ,ధర్మప్రచారక్ లు నెమరు వేసుకున్నారు.



