ఆకట్టుకుంటోన్న ‘త్రిబాణధారి బార్భరిక్’ థీమ్ సాంగ్.. త్వరలోనే చిత్రం విడుదల
వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్, కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం రిలీజ్ కోసం చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ‘బార్బరిక్’ మూవీ కాన్సెప్ట్ తెలియజేసేలా ఓ థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ లిరికల్ వీడియోని చూస్తే కథ ఎలా ఉండబోతోందో అన్న హింట్ ఇచ్చారు. ఇక ఈ థీమ్ సాంగ్‌ను సనారే రచించారు. కృష్ణ చైతన్య, సాయి చరణ్, శివ, హర్ష వర్దన్, వల్లి గాయత్రి, సింధూజ శ్రీనివాసన్, నాద ప్రియ, బృంద కలిసి ఆలపించారు. ఆదిత్య అయ్యంగార్ ఈ ర్యాప్‌ను పాడారు. ఇక ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన బాణీ ఎంతో ఉత్తేజపర్చేలా ఉంది.
‘అనగా అనగా కథలా’ అనే పాట ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక ఉదయ భాను నెగెటివ్ షేడ్స్ ఉన్న కారెక్టర్ ద్వారా సినిమా మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుందని సమాచారం. ఓ మంచి రిలీజ్ డేట్ కోసం చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలోనే సరైన విడుదల తేదీని టీం ప్రకటించనుంది.
తారాగణం: సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్, మేఘన తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన , దర్శకత్వం :మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయపాల్ రెడ్డి అడిదాల
సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
డిఓపి : కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం : ఇంఫ్యూజన్ బ్యాండ్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నా
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజీష్ నంబూరు
లైన్ ప్రొడ్యూసర్ : బి.ఎస్. రావు
ఫైట్స్ : రామ్ సుంకర
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
PRO : సాయి సతీష్



