గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024ను ప్రకటించడం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతోషం వ్యక్తపరిచింది

0
246
TFPC Press Note About Gaddar Awards
TFPC Press Note About Gaddar Awards

Dt. 30.05.2025
ప్రెస్ నోట్

తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఆయా సంబంధిత విభాగాలలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024ను ప్రకటించడం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతోషం వ్యక్తపరిచింది. శ్రీమతి. జయసుధ, అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క, రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్రాజు) మరియు తెలంగాణ ఎఫ్డిసి మేనేజింగ్ డక్టర్ ఎస్. హరీష్ (IAS) లకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 చిత్రాల ఎంపిక కొరకు చైర్మన్ జయసుధ మరియు జ్యూరీ, ఆయా చిత్రాల ఎంట్రీలను జాగ్రత్తగా పరిశీలించి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కోసం ఉత్తమ చిత్రాలను, కళాకారులను మరియు సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కోసం ఎంపిక చేసిన చిత్రాల నిర్మాతలకు, సంబంధిత చిత్రా విభాగాలలో ఎంపిక చేసిన కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.

(టి. ప్రసన్న కుమార్)
గౌరవ కార్యదర్శి

 

TFPC Press Note About Gaddar Awards
TFPC Press Note About Gaddar Awards

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here