సమంత నిర్మాణంలో మే 9న రాబోతోన్న ‘శుభం’ మూవీ ట్రైలర్ విడుదల

0
237
Samantha Cameo In Subham
Samantha Cameo In Subham

సమంత నిర్మాణంలో మే 9న రాబోతోన్న ‘శుభం’ మూవీ ట్రైలర్ విడుదల

ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నటి-నిర్మాత సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని మే 9న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం (ఏప్రిల్ 27) నాడు శుభం చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

శుభం ట్రైలర్‌ను గమనిస్తే.. ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్‌ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా కూడా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్‌ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు.

శుభం ట్రైలర్‌ను చూస్తే ఈ చిత్రంలో హాస్యం, హర్రర్, ఉత్కంఠ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించినట్టుగా కనిపిస్తోంది. శుభం మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. వివేక్ సాగర్ బీజీఎం స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం ప్రధాన ఆకర్షణ కానుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here