‘మార్కో’ దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు ప్రొడక్షన్స్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం

0
31
Dil Raju With Haneef Adeni
Dil Raju With Haneef Adeni

‘మార్కో’ దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు ప్రొడక్షన్స్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం

టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగానే ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ సినిమాను చేయబోతోంది. శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఖరారు కాలేదు. ఈ మూవీని హ బడ్జెట్‌తో పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్నారు.

మార్కోతో హనీఫ్ తనలోని మాస్, వయలెన్స్, యాక్షన్ యాంగిల్‌ను చూపించారు. ఇక ఇప్పుడు ఈయన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇక ఈ ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గురు ఫిల్మ్స్‌కు చెందిన సునీతా తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here