“విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ” ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభం

0
73

“విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ” ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభం

విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ (VFC) ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పూజా కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. VFC ప్రొడక్షన్ హౌస్ ద్వారా శివకృష్ణ మందలపు నిర్మాత గా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహూ గారపాటి గారు, ప్రముఖ దర్శకుడు అడ్డా సినిమా ఫెమ్ కార్తీక్ రెడ్డి గారు , నిర్మాత రాందాస్ ముత్యాల, ప్రముఖ వ్యాపార వేత్త నర్సింహ రెడ్డి, మందలపు ప్రవళిక, స్వప్న చౌదరి అమ్మినేని లు ముఖ్య అతిథులుగా పూజా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

Vikranth Film Creations Launched
Vikranth Film Creations Launched

ఈ సందర్భంలో శివకృష్ణ మందలపు గారు మాట్లాడుతూ, “మా విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలో ఒక పెద్ద సినిమా మొదలు అవుతుంది, భవిష్యత్తులో ఎన్నో మంచి సినిమాలు నిర్మించాలన్నదే మా లక్ష్యం.కుటుంబ సభ్యుల సపోర్ట్, స్నేహితుల సహకారం, ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహం లేకుండా ఇది సాధ్యంకాదు” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర బృందం, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.వేద పండితుల సమక్షంలో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. VFC నుండి త్వరలోనే మేజర్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వెలువడనుంది.

Vikranth Film Creations Launched
Vikranth Film Creations Launched

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here