జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలతో త్వరలో భేటి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .
జర్నలిస్ట్ ల సమస్యలకు సరైన పరిష్కరం చూపాల్సిన అవసరం ఉంది.
సుప్రిం కోర్టు తీర్పును కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చిన JCHSL అధ్యక్ష్యుడు గోపరాజు
హైదరాబాద్ – జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందనీ కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలతో భేటి అవుతానని వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ లోని “ది జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ”కి జరిగిన ఎన్నికల్లో గెలిచిన పాలకమండలి అధ్యక్ష్యుడు బ్రహ్మాండభేరి గోపరాజు నేతృత్వంలోని కమిటీ సభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. సుప్రింకోర్టు తీర్పు హౌసింగ్ సొసైటీలకు అడ్డుగోడగా మారిందనీ, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపాలని గోపరాజు కోరారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి త్వరలోనే హైదరాబాద్ లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలతో భేటి అవుతానని, సమస్యకు సరైన పరిష్కారాన్ని చూపాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను కిషన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి భీమగాని మహేశ్వర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు డి. కమలాకరాచార్య, బీజేపీ సీనియర్ నాయకులు వనపల్లీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పరమేశ్వర్ పాల్గొన్నారు.



