‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ యదు వంశీ
వెన్నెల కిషోర్, రైటర్ మోహన్, వెన్నపూస రమణా రెడ్డి, శ్రీ గణపతి సినిమాస్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టీజర్ లాంచ్
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ కి రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మేకర్స్ ఈరోజు టీజర్ లాంచ్ చేశారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఒక పోలీసు అధికారి తనకి క్రిడెట్ వచ్చేలా ఓ క్రిమినల్ కేసును ఛేదించడానికి ఒక తెలివైన డిటెక్టివ్‌ని సాయం కోరుతూ ఆ పనిని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌కి అప్పగిస్తాడు.
టీజర్ మూవీ ప్రిమైజ్ ని ఆసక్తికరంగా పరిచయం చేస్తోంది. వెన్నెల కిషోర్ లీడ్ రోల్ హ్యుమర్, ఇంటెల్జెంట్ బ్లెండ్ తో ఆకట్టుకుంది, కేసులను పరిష్కరించడంలో అతని యూనిక్ స్టయిల్ ని ప్రజెంట్ చేస్తోంది. వెన్నెల కిషోర్ తన పాత్రలో ఒదిగిపోయారు.
రైటర్ మోహన్ ఎంగేజింగ్ కథను రూపొందించారు,అతని డైరెక్షన్ కట్టిపడేసింది. మల్లికార్జున్ ఎన్ సినిమాటోగ్రఫీ కథనానికి డెప్త్ ని జోడించగా, సునీల్ కశ్యప్ స్కోర్ సినిమా జోరును పెంచింది. ఎడిటింగ్ అవినాష్ గుర్లింక్. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. సురేష్ బిమ్‌గాని ఆర్ట్ డైరెక్టర్. రాజేష్ రామ్ బాల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ చాలా క్యురియాసిటీ పెంచింది. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయం సాధించిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మూవీ టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. వంశీ నందిపాటి గారు మంచి సినిమాలని సపోర్ట్ చేస్తున్నారు. 2018, కమిటీ కుర్రాళ్ళు, రీసెంట్గా రిలీజ్ అయిన క.. ఇవన్నీ అద్భుతమైన విజయాలతో అలరించాయి. వంశీ గారిది నిజంగా గోల్డెన్ హ్యాండ్. మంచి కంటెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు. ఆడియన్స్ కూడా కంటెంట్ ఉంటే చిన్న సినిమాని కూడా చాలా పెద్ద విజయాన్ని అందిస్తున్నారు. కమిటీ కుర్రాళ్ళు, అయ్, క సినిమాలు అది ప్రూవ్ చేశాయి. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చంటబ్బాయి గారి తాలూకా అనే ట్యాగ్ పెట్టడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తెలుగులో చాలా తక్కువగా వస్తుంటాయి. మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటేనే ఇలాంటి మంచి సినిమాలు ప్రేక్షకులు ముందుకు వెళ్తాయి. వంశి గారికి గుడ్ లక్. ఇలాంటి మంచి సినిమాలకు సపోర్ట్ చేసినందుకు థాంక్యూ వెరీ మచ్. రైటర్ మోహన్ గారు చాలా మంది లెజెండరీస్ దగ్గర వర్క్ చేశారు. తప్పకుండా ఈ సినిమాతో ఆయనకు మంచి సక్సెస్ వస్తుంది. అనన్య చాలా మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ లక్’ అన్నారు.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. రెండు నెలల క్రితం ఈ సినిమాని చూశాను. సినిమా చూస్తూ ఆద్యంతం మెస్మరైజ్ అయ్యాను. సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఇరగదీసేసాడు అనిపించింది. అప్పుడే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రొడ్యూసర్ గారికి చెప్పాను. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా దూసుకెళ్లిపోతుందని కాన్ఫిడెంట్ గా చెప్పాను. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమీ ఉండదు. అంత కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. కంటెంట్ కొడితే ఎలా ఉంటుందో కమిటీ కుర్రాళ్ళు సినిమాతో యదువంశీ నిరూపించాడు. మంచి కంటెంట్ తో వస్తున్న సినిమాలను సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రేక్షకులకు అందించడం మా ఉద్దేశం. ఈ సినిమా కూడా తప్పకుండా మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. క్రిస్మస్ కి వస్తున్నాం. ఈ టీంలో పని చేసిన అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ .100% మనం కొట్టబోతున్నాం. రమణ రెడ్డి గారికి డైరెక్టర్ మోహన్ గారికి సినిమా అంటే చాలా పాషన్, ఒక మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాత డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో డిసెంబర్ 25న థియేటర్స్ లో చూడబోతున్నాం’ అన్నారు.
యాక్టర్ రవితేజ మహాదాస్యం మాట్లాడుతూ.. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న వంశీ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా వంశి గారు రిలీజ్ చేస్తున్నారని చెప్పినప్పుడు మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారి కళ్ళల్లో ఆనందం చూశాను. సినిమాలు తీయడం చాలా కష్టం. అందులోని ఇలాంటి సినిమాలు తీయడం ఇంకా కష్టం. నిజాయితీగా ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. మా సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్న వంశీ గారికి థాంక్యూ సో మచ్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 25న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను. థాంక్యూ’ అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వంశీ గారు ఈ సినిమా తీసుకున్న తర్వాత మా టీమ్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాంటిదే. అలా మా డైరెక్టర్ గారు సినిమాని డిజైన్ చేశారు. దానికి మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. చాలా మంచి నటీనటులు టెక్నీషియన్స్ సినిమాకి పనిచేస్తున్నారు. డిసెంబర్ 25న ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఉంది. అందరూ సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు
డైరెక్టర్ రైటర్ మోహన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. వంశి గారు ఈ సినిమా తీసుకోవడంతో మాకు చాలా ధైర్యం వచ్చింది. ఆయన కంటెంట్ ఉంటేనే తీసుకుంటారు. ఆయన సినిమా తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన గైడెన్స్, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆయన చెప్పిన మార్పులు మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆయన కూడా డే నైట్ కష్టపడి ఇప్పుడు మనం చూసిన టీజర్ ని చేయించారు. మా నిర్మాత రమణారెడ్డి గారికి థాంక్యూ. వెన్నెల కిహ్సోర్ గారు చాలా కోపరేట్ చేశారు. షూటింగ్ ఉండటం వల్ల ఆయన ఈ వేడుకకి రాలేకపోయారు. అనన్య గారు, రవి గారు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్ యూ’ అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. డైరెక్టర్ మోహన్ గారికి, నిర్మాత రమణారెడ్డి గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను’ అన్నారు. సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయి ఇద్రీమా నాగరాజు, MVN కశ్యప్.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రైటర్ మోహన్
బ్యానర్: శ్రీ గణపతి సినిమాస్
నిర్మాత: వెన్నపూస రమణారెడ్డి
సమర్పణ: లాస్య రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజేష్ రామ్ బాల్
సంగీతం: సునీల్ కశ్యప్
డీవోపీ: మల్లికార్జున్ ఎన్
ఎడిటర్: అవినాష్ గుర్లింక్
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్