‘రాబిన్‌హుడ్’ నా కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. భీష్మ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ క్రిస్మస్ మాదే : ప్రెస్ మీట్ లో హీరో నితిన్
హీరో నితిన్ మచ్-అవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్- వన్ మోర్ టైమ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా టీం ఫస్ట్ కనెక్ట్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ఫస్ట్ కనెక్ట్ ప్రెస్ మీట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాబిన్‌హుడ్.. నేను, వెంకీ కలిసి చేస్తున్న సెకండ్ ఫిల్మ్. ‘భీష్మ’ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. శ్రీలీలతో కూడా ఇది నా సెకండ్ ఫిల్మ్. ఈ సినిమాతో మా పెయిర్ హిట్ పెయిర్ అనిపించుకుంటుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ కి థాంక్యూ. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు రవి గారు లేకపోతే ఈ సినిమా ఇంత రిచ్, ఇంత గ్రాండ్ గా వచ్చేది కాదు. నా కెరియర్ లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. ఒక విషయం కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. డిసెంబర్ 25 నాడు రాబిన్‌హుడ్ నిర్మాతలు పెట్టిన డబ్బుని రెంట్టింపుతో సహా మీనుంచి దోచుకొని వారికి ఇస్తాడు. గ్యారెంటీ గా చెబుతున్నా. ఈ క్రిస్మస్ మాదే. థాంక్ యూ’ అన్నారు.
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. రాబిన్‌హుడ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నా క్యారెక్టర్జేషన్ పరంగా పెర్ఫార్మెన్స్ పరంగా చాలా డిఫరెంట్ గా ఉండే సినిమా ఇది. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్ గా, డాన్సింగ్ స్పెషల్ గా ఆడియన్స్ చూశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటారని భావిస్తున్నాను. నిర్మాతలు నవీన్ గారు, రవి గారికి, హీరో నితిన్ గారి, డైరెక్టర్ వెంకీ గారికి థాంక్యూ సో మచ్. సినిమాని మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. రాబిన్‌హుడ్ స్క్రిప్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం దొరికింది. ఇప్పుడు వరకు నా కెరియర్లో ఈ సినిమా ద బెస్ట్ వర్క్ అనుకుంటున్నాను. ఎడిట్ రూమ్ లో సినిమా చూసుకున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మా ప్రొడ్యూసర్స్ కూడా చూశారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నన్ను, కథని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకి థాంక్యూ సో మచ్. నన్ను ఎంతో బలంగా నమ్మి సపోర్ట్ చేసే నితిన్ అన్నకి థాంక్యూ. శ్రీలీలని ఇప్పటివరకు అందరూ డాన్సింగ్ క్వీన్ అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ క్వీన్ అని కూడా అంటారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. వన్ మోర్ టైం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో ఒక ఐటెం సాంగ్ ఉంది. అది కూడా ట్రంప్ కార్డు లాగా ఫీల్ అవుతున్నాం. క్రిస్మస్ హాలిడేస్ కి ఒక సెలబ్రేషన్ లో ఉండాలని డిసెంబర్ 25న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాం. డెఫినెట్ గా ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది’ అన్నారు
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా మీద మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది. ఎక్స్ట్రార్డినరీ ఫిలిం. నితిన్ గారి కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. డెఫినెట్ ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. నితిన్ గారు శ్రీలీల, డైరెక్టర్ వెంకీ కుడుముల అందరూ 100% ఎఫర్ట్ పెట్టారు. సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థాంక్యూ సో మచ్ అన్నారు’ అన్నారు.
లిరిసిస్ట్ కేకే మాట్లాడుతూ.. వన్ ఇయర్ గా వెంకి కుడుములు గారితో ఈ జర్నీ సాగుతోంది. ఇందులో రెండు పాటలు రాశాను. నిన్ననే వన్ మోర్ టైం సాంగ్ రిలీజ్ అయింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంత చక్కటి చిత్రంలో రాసే అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకి థాంక్యూ సో మచ్. ఇంత చక్కటి సందర్భాన్ని క్రియేట్ చేసిన వెంకీ గారికి కూడా థాంక్స్ చెప్తున్నాను’ అన్నారు.
నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రం మోర్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో