కీర్తి సురేశ్‌ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రివాల్వర్ రీటా’ ఏపీ, తెలంగాణ రైట్స్ ని దక్కించుకున్న హాస్య మూవీస్ రాజేష్ దండా

0
70
Keerthy Suresh - Revolver Rita
Keerthy Suresh - Revolver Rita

కీర్తి సురేశ్‌ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రివాల్వర్ రీటా’ ఏపీ, తెలంగాణ రైట్స్ ని దక్కించుకున్న హాస్య మూవీస్ రాజేష్ దండా

నేషనల్ అవార్డ్‌ విన్నింగ్‌ హీరోయిన్ కీర్తి సురేశ్‌ టైటిల్ రోల్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘రివాల్వర్ రీటా’. రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జే.కే చంద్రు  దర్శకత్వం వహిస్తున్నారు.

ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం (మహారాజ్ నిర్మాత) జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.

తాజాగా ఈ మూవీ ఏపీ, తెలంగాణ రైట్స్ ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ హాస్య మూవీస్ రాజేష్ దండా ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రవీణ్ కె ఎల్ ఎడిటర్, స్టంట్స్ ని దిలీప్ సుబ్బరాయన్ సమకూరుస్తున్నారు.

నటీనటులు: కీర్తి సురేష్ , రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకత్వం: జేకే చంద్రు
నిర్మాతలు: సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి
తెలుగు రిలీజ్: హాస్య మూవీస్ రాజేష్ దండా
బ్యానర్‌లు: ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్
సంగీతం: సీన్ రోల్డాన్
ఎడిటర్:  ప్రవీణ్ కె ఎల్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here