‘మెకానిక్ రాకీ’ నుంచి రామ్ మిరియాల పాడిన ‘ఐ హేట్ యూ మై డాడీ’ సాంగ్ రిలీజ్

0
19
'I Hate You My Daddy'
'I Hate You My Daddy'

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ నుంచి రామ్ మిరియాల పాడిన ‘ఐ హేట్ యూ మై డాడీ’ సాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించడానికి రెడీగా వున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇంట్రస్టింగ్ టీజర్‌, ట్రైలర్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

‘మెకానిక్ రాకీ’ రాకీ మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు మేకర్స్ ‘ఐ హేట్ యూ మై డాడీ’ సాంగ్ రిలీజ్ చేశారు. జేక్స్ బిజోయ్ ఈ సాంగ్ ని థపింగ్ బీట్స్ తో క్యాచి నెంబర్ గా కంపోజర్ చేశారు.

ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ని హ్యుమరస్ అండ్ ఎంటర్ టైనింగ్ గా ప్రజెంట్ చేసిన ఈ సాంగ్ ని స్టార్ సింగర్ రామ్ మిరియాల తన మెస్మరైజింగ్ వాయిస్ తో ఎనర్జిటిక్ గా పాడారు. సనారే రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.

ఈ సాంగ్ లో ఫాదర్ అండ్ సన్ గా నరేష్, విశ్వక్ సేన్ బాండింగ్ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంది. విశ్వక్ డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. క్యాచి ట్యూన్, లిరిక్స్, ఎనర్జిటిక్ వోకల్స్, సూపర్బ్ పెర్ఫార్మెన్స్ లతో ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మనోజ్ కటసాని డీవోపీ గా పనిచేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
పీఆర్వో:  వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here