డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నవంబర్ 8న రాబోతోన్న ‘జాతర’

0
104
Theatres
Theatres "Jathara" From November 8th

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నవంబర్ 8న రాబోతోన్న ‘జాతర’

ప్రస్తుతం కొత్త తరం ఇండస్ట్రీలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తున్నారు. మల్టీ టాలెంట్‌తో వస్తున్న యూత్ ఇండస్ట్రీలోకి కొత్త మేకింగ్, టేకింగ్‌ను తీసుకొస్తున్నారు. దర్శకత్వం, రచయిత, హీరోగా తమ తమ టాలెంట్‌లను చాటుకుంటున్న ఈ క్రమంలో ‘జాతర’ అనే చిత్రంతో మరో కొత్త టీం ఇండస్ట్రీలోకి రాబోతోంది.

గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన జాతర చిత్రానికి సంబంధించి ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో జాతర చిత్రం రాబోతోంది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లోకి రాబోతోంది.

ఈ చిత్రంలో దీయా రాజ్ కథానాయికగా నటించగా.. ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటించారు. కె.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 8న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.

తారాగణం: సతీష్ బాబు రాటకొండ, దీయా రాజ్, ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్

సాంకేతిక బృందం:
సమర్పణ : గల్లా మంజునాథ్
నిర్మాతలు : రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి
బ్యానర్లు : రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ, మూవీటెక్ LLC
రచన, దర్శకత్వం : సతీష్ బాబు రాటకొండ
కెమెరామెన్ : కె.వి. ప్రసాద్
సంగీతం : శ్రీజిత్ ఎడవణ
పీఆర్వో : సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here