‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నుంచి ‘హే తారా’ అంటూ సాగే పాట విడుదల

0
89
"Hey Taara" Lyrical Video Out Now

నిఖిల్ సిద్ధార్థ్‌, సుధీర్ వ‌ర్మ‌, ఎస్‌.వి.సి.సి ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నుంచి ‘హే తారా’ అంటూ సాగే పాట విడుదల

కార్తికేయ 2 చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ప్రస్తుతం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ త‌ర్వాత సుధీర్ వర్మ, నిఖిల్ కాంబోలో రాబోతున్న సినిమా కావ‌టంతో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో కన్నడ క్రేజీ హీరోయిన్ అయిన రుక్మిణి వసంత్ హీరోయిన్ నటించారు. మ‌రో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో నటించగా.. హ‌ర్ష చెముడు ముఖ్య పాత్ర‌ను పోషించారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యోగేష్ సుధాక‌ర్‌, సునీల్ షా, రాజా సుబ్ర‌మ‌ణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూస‌ర్స్‌. బాపినీడు.బి ఈ చిత్రానికి స‌మ‌ర్పణ‌. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడియస్ గీతాన్ని యూనిట్ విడుదల చేసింది.

కార్తీక్ స్వరపరిచిన ఈ బాణీకి కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించారు. కార్తీక్, నిత్యశ్రీల గాత్రంలో ఈ పాట ఎంతో వినసొంపుగా శ్రోతలకు హాయినిచ్చేలా ఉంది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, కెమిస్ట్రీని తెలిపేలా ఈ పాట సాగింది. మనోహరమైన సాహిత్యం హృద్యమైన ట్యూన్‌ని కలిగి ఉన్న ఈ మెలోడీతో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రేమలో పడతారనిపిస్తోంది.

సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని.. స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 8న‌ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Click Here For Hey Taara Lyrical Video From Appudo Ippudo Eppudo Movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here