ఆకట్టుకుంటోన్న అప్సరా రాణి ‘రాచరికం’ నుంచి ‘ఏం మాయని’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ పాట
ప్రస్తుతం కొత్త తరహా కథలకు ఆడియెన్స్ పట్టం కడుతున్నారు. మ్యూజికల్ నెంబర్స్ జనాలకు కనెక్ట్ అయితే చిత్రాలకు వచ్చే బజ్ గురించి అందరికీ తెలిసిందే. ఓ సినిమా జనాల్లోకి ఎక్కువగా వెళ్లాలంటే పాటలే ప్రధానం. అలా ఇప్పుడు రాచరికం మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే టిక్కు టిక్కు అంటూ హుషారైన పాటను ఇది వరకు విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ అనే చిత్రం తెరకెక్కింది. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. సురేశ్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ మంచి మెలోడీ పాటను రిలీజ్ చేశారు.
ఏం మాయని అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ పాటను హరి చరణ్ ఆలపించారు. ఈ పాటను వేంగి రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ వేంగి ఇచ్చిన బాణీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక ఈ పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ మెలోడీ ట్రాక్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఈ మూవీకి ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా పని చేశారు. రామ్ ప్రసాద్ మాటలు అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చాణక్య, ఎడిటర్‌గా జేపీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఈ చిత్రంలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.