యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా “క” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్నో అందమైన లొకేషన్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ తో ఈ సినిమాను అనుకున్న టైమ్ కు పూర్తి చేయగలిగారు మూవీ టీమ్. “క” సినిమా ఔట్ పుట్ పట్ల మేకర్స్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా కంటెంట్ కు మంచి బజ్ ఏర్పడిన నేపథ్యంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “క” సినిమా సిద్ధమవుతోంది.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు